Begin typing your search above and press return to search.
ఆ రొమాంటిక్ పిల్ల మళ్లీ వచ్చింది
By: Tupaki Desk | 18 May 2018 11:13 AM GMTకళ్లతో రొమాన్స్ చేసిన పిల్ల ఎవరో అందరికి బాగా తెలిసే ఉంటుంది. కొన్ని నెలల క్రితం దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం - రాజ్యసభ లో నాయకుల వివాదాలు వంటి విషయాలు ఎంత సీరియస్ అయినప్పటికీ జనాలు ఆ పిల్ల గురించే చర్చించుకోవడం గమనార్హం. పైగా ఓ వర్గం మీడియా రొమాంటిక్ పిల్ల కి ఫుల్ గా క్రేజ్ అందేలా చేసింది. అంతగా అలజడి రేపిన ఆ బ్యూటీ ఎవరో ఇప్పటికే తెలిసి ఉంటుంది.
ప్రియా ప్రకాష్ వారియర్ కొన్ని వారాల క్రితం వరకు సోషల్ మీడియాలో ప్రోమోలతో రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో సాంగ్ తో వచ్చింది. ఓరు ఆధార్ లవ్ అనే సినిమాలోని ఓ పాటను తమిళ్ లో రిలీజ్ చేశారు. ఆసలైతే ఇది మలయాళం సినిమా. ఉమర్ లులు ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. అయితే రీసెంట్ గా మున్నలే పొన్నలే అనే సాంగ్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సాంగ్ బాగానే ఉంది. ఇక ఎప్పటిలానే హావభావాలతో ఆకర్షించేందుకు హీరోయిన్ హీరో కష్టపడ్డారు.
కానీ అనుకున్నంతగా ఆకట్టుకోవడం లేదు. ఓ యాంగిల్ ప్రియా ప్రకాష్ ఫేస్ చేంజ్ అయినట్లు కనిపిస్తోంది. ఇక మ్యూజిక్ బావుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇక సినిమాను సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వీడియో కోసం క్లిక్ చేయండి