Begin typing your search above and press return to search.
ఆస్కార్ వేడుకల్లో ఇర్ఫాన్ ఖాన్ - సుశాంత్ సింగ్ లకు అరుదైన గౌరవం..!
By: Tupaki Desk | 27 April 2021 6:34 AM GMT93వ అకాడమీ అవార్డుల కార్యక్రమం (ఆస్కార్ అవార్డ్స్) వైభవంగా జరిగింది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ - యూనియన్ స్టేషన్ లో కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ఈ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ దివంగత సినీ ప్రముఖులకు గొప్ప గౌరవం దక్కింది. ఆస్కార్ వేడుకలో భాగంగా ప్రదర్శించిన ఇన్ మెమొరీయమ్ ఈవెంట్ లో ఇర్ఫాన్ ఖాన్ - రిషి కపూర్ - సుశాంత్ సింగ్ రాజ్ పుత్ - ఆస్కార్ విజేత భాను అతయా లకు ఘన నివాళి అర్పించారు.
ప్రతి ఏటా జరిగే ఆస్కార్ అవార్డ్ వేడుకలో ప్రపంచ నలమూలల్లో ఉన్న ప్రాముఖ్యమైన నటులు, సాంకేతిక నిపుణుల్ని చిత్ర పరిశ్రమ కోల్పోతే.. వారి జ్ఞాపకార్థం ఓ మెమోరియమ్ వీడియో ప్రదర్శిస్తుంటారు. 93వ వేడుకలో సినీ ప్రముఖులకు నివాళులర్పించే కార్యక్రమంలో భాగంగా గతేడాది మరణించిన ఇర్ఫాన్ ఖాన్ - రిషి కపూర్ - సుశాంత్ సింగ్ - భాను లకు చోటు కల్పించారు.
బాలీవుడ్ లెజెండరీ యాక్టర్స్ ఇర్ఫాన్ ఖాన్ - రిషి కపూర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ గతేడాది మరణించారు. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ముంబైలోని తన ఫ్లాట్ లో ఉరివేసుకొని చనిపోవడం వివాదంగా మారింది. 'గాంధీ' చిత్రానికి క్యాస్టూమ్ డిజైనర్ గా ఆస్కార్ అందుకున్న భాను అతయా బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతూ ఈ లోకాన్ని విడిచారు. భారతీయ సినీ పరిశ్రమకు విశేష సేవలందించిన వీరందరినీ ఇప్పుడు ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఘన నివాళి అర్పించారు.