Begin typing your search above and press return to search.

'RRR'కు ఆస్కార్.. హాలీవుడ్ నిర్మాత జోష్యం!

By:  Tupaki Desk   |   10 Jan 2023 5:38 AM GMT
RRRకు ఆస్కార్.. హాలీవుడ్ నిర్మాత జోష్యం!
X
'RRR'.. ఇప్పుడు ఏ నోట విన్నా ఇదేమాట‌. ఇండియ‌న్ సినీ ప్రియుల‌తో పాటు హాలీవుడ్ టెక్నిషియ‌న్స్‌,యాక్ట‌ర్స్‌, డైరెక్ట‌ర్స్‌, ప్రొడ్యూస‌ర్స్ ప్ర‌స్తుతం 'RRR' జ‌పం చేస్తున్నారు. విదేశీ ప్రేక్ష‌కులు సైతం 'RRR' కు ఆస్కార్ ఖాయం అంటూ నెట్టింట వైర‌ల్ గా పోస్ట్ లు పెడుతూ ట్రెండ్ చేస్తున్నారు. రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన పాన్ ఇండియా విజువ‌ల్ వండ‌ర్‌ మూవీ 'RRR'. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల తొలి క‌ల‌యిక‌లో జ‌క్క‌న్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టించిన విష‌యం తెలిసిందే.

ఇద్ద‌రు లెజెండ‌రీ ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీం ల క‌థ‌గా ప్రీ ఇండిపెండెన్స్ ఎరా నేప‌థ్యంలో సాగే ఫిక్ష‌న‌ల్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్, గోండు బెబ్బులి కొమురం భీంగా ఎన్టీఆర్ న‌టించారు. ఫిక్ష‌న‌ల్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా సంచల‌నాలు సృష్టించ‌డ‌మే కాకుండా హాలీవుడ్ సినిమాల‌ని మాత్ర‌మే ఇష్ట‌ప‌డే విదేశీ ప్రేక్ష‌కుల్ని సైతం అబ్బుర ప‌రిచి ఆక‌ట్టుకుంది.

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌ముఖుల ప్ర‌శంస‌ల‌తో పాటు ప్రేక్ష‌కుల్ని సైతం విశేషంగా ఆక‌ట్టుకున్న ఈ మూవీ ఇప్పుడు అంత‌ర్జాతీయ అవార్డు వేదిక‌ల‌పై త‌న స‌త్తా చాటుతూ భారీతీయ సినిమా గ‌ర్వ‌ప‌డేలా చేస్తోంది. రీసెంట్ గా ప‌లు అంతర్జాతీయ వేదిక‌ల‌పై ప‌లు ఆవార్డుల్ని ద‌క్కించుకున్న 'RRR' జ‌న‌వ‌రి 10న కాలిఫోర్నియాలో జ‌రుతున్న ప్ర‌తిష్టాత్మ‌క గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో పోటీ ప‌డ‌బోతోంది. రెండు విభాగాల్లో ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో పోటీకి దిగుతున్న విష‌యం తెలిసిందే.

ఇదిలా వుంటే చివ‌రి నిమిషంలో ఆస్కార్ అకాడ‌మీ అవార్డ్స్ కు షార్ట్ లిస్ట్ చేయ‌బ‌డిన 'RRR' 'నాటు నాటు ' సాంగ్ కు గానూ ఆస్కార్ బ‌రికి నామినేట్ కావ‌డం తెలిసిందే. మార్చిలో జ‌ర‌గ‌నున్న ఈ అవార్డుల వేడుక కోసం యావ‌త్ దేశం మొత్తం ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేప‌థ్యంలో ప‌లువురు హాలీవుడ్ న‌టీన‌టులు, టెక్నీషియ‌న్ లు ఈ మూవీకి ఆస్కార్ రావ‌డం ప‌క్కా అంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

తాజాగా హాలీవుడ్ నిర్మాత జాస‌న్ బ్ల‌మ్ 'RRR' కు ఆస్కార్ ప‌క్కా అంటూ ప్ర‌క‌టించారు. ఆస్కార్ ఓట‌ర్ల కోసం 'RRR' స్పెష‌ల్ షోని ఏర్పాటు చేశారు. ఈ షోలో పాల్గొన్న ప్ర‌తీ ఒక్క‌రు 'RRR' పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

హాలీవుడ్ నిర్మాత జాస‌న్ బ్ల‌మ్ 'RRR' కు ఆస్కార్ ప‌క్కా అంటూ వెల్ల‌డించారు. 'RRR' ఉత్త‌మ చిత్రంగా నిలుస్తుంద‌ని, నేను 'RRR' విన్నింగ్ బెస్ట్ పిక్ తో వెళుతున్నాను. ద‌య‌చేసి దీనిని గుర్తించండి' అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. జాస‌న్ బ్ల‌మ్ దీనితో పాటు మరిన్ని ట్వీట్ లు 'RRR'పై చేశారు. ప్ర‌స్తుతం అవి నెట్టింట వైర‌ల్ గా మారి ట్రెండ్ అవుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.