Begin typing your search above and press return to search.
'ఆర్ఆర్ఆర్' కి ఆస్కార్ 99%
By: Tupaki Desk | 16 Aug 2022 7:32 AM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా రాబోయే ఆస్కార్ అవార్డుల్లో సత్తా చాటడం ఖాయం అంటూ ఇండియన్ సినీ ప్రేక్షకులు మరియు మీడియా వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్ ఆర్ ఆర్ సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలను చేశాడు.
ఆయన తన సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్ సినిమా తప్పకుండా ఈసారి ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ లో చోటు దక్కించుకుంటుందని పేర్కొన్నాడు.
పలు విభాగాల్లో సినిమా కు నామినేషన్స్ దక్కుతాయనే నమ్మకంను ఆయన వ్యక్తం చేయడంతో పాటు 99% ఆస్కార్ బరిలో ఆర్ ఆర్ ఆర్ ఉంటుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశాడు.
ఇండియన్ సినిమాలు ఆస్కార్ అవార్డు ను గెలుచుకోవడం అలా ఉంచి.. కనీసం ఎంట్రీ దక్కించుకున్నా చాలు.. నామినేషన్స్ లో నిలిచినా చాలు అన్నట్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆర్ ఆర్ ఆర్ కచ్చితంగా ఆస్కార్ కు నామినేట్ అవుతుందనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ యూనిట్ సభ్యులతో పాటు చరణ్ మరియు ఎన్టీఆర్ అభిమానులు సినిమా లోని వివిధ విభాగాల యొక్క అద్భుతమైన వర్క్ తో ఆస్కార్ అవార్డు కూడా దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. కనుక ఆర్ ఆర్ ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతూ ఉంది.
నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యి ప్రపంచంలోని పలు దేశాల్లో వార్తల్లో నిలిచింది. పైగా సినిమాలోని ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా ఒక ఇంగ్లీష్ సినిమా స్థాయిలో చర్చ జరిగింది. కనుక ఆస్కార్ నామినేషన్స్ ను దక్కించుకోవడం పక్కా అన్నట్లుగా ఎన్టీఆర్ మరియు చరణ్ అభిమానులు ధీమాతో ఉన్నారు.