Begin typing your search above and press return to search.

ఆస్కార్ నామినేటెడ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్..!

By:  Tupaki Desk   |   22 Nov 2022 5:30 AM GMT
ఆస్కార్ నామినేటెడ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్..!
X
95వ అకాడెమీ అవార్డులకు ఇండియన్ సినిమాల నుంచి ఎంపికైన మూవీ చెల్లో షో అదే లాస్ట్ ఫిల్మ్ షో. పాన్ నలిన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2021 లో ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది. 2022 అక్టోబర్ 14న లాస్ట్ ఫిల్మ్ షో థియేట్రికల్ రిలీజైంది. గుజరాతీ భాషలో తెరకెక్కిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేశారు. నవంబర్ 25న నెట్ ఫ్లిక్స్ లో లాస్ట్ ఫిల్మ్ షో అందుబాటులో ఉంటుంది. ఆస్కార్ నామినేటెడ్ మూవీగా ఇప్పటికే ఈ మూవీ మీద భారీ క్రేజ్ ఏర్పడింది.

థియేట్రికల్ రిలీజ్ చూడలేని ఆడియన్స్ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. ఈ సినిమా చూసేందుకు ఇండియన్ సినీ లవర్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఉన్నారు. ఇంతకీ అసలు లాస్ట్ ఫిల్మ్ షో కథ ఏంటి అంటే..

9 ఏళ్ల కుర్రాడు థియేటర్ లో ప్రొజెక్టర్ ఆపరేటర్ కి ఏర్పడ్డ పరిచయంతో థియేటర్ కి వెళ్లి ప్రొజెక్షన్ గదిలో సినిమాలు వేయడం చూస్తాడు. ప్రొజెక్ట్ నుంచి వెండితెర మీద బొమ్మ పడటం చూసి అతనికి ఆసక్తి కలుగుతుంది. సమ్మర్ మొత్తం అలా ప్రొజెక్షన్ రూం లోనే గడిపేసిన ఆ కుర్రాడు సినిమాల మీద ఆసక్తి పెంచుకుంటాడు. అలా ఆ కుర్రాడి జీవితంలో జరిగిన మార్పులనే లాస్ట్ ఫిల్మ్ షోగా తెరకెక్కించారు.

పాన్ నలిన్ ఈ మూవీ చాలా ఎమోషనల్ గా తెరకెక్కించారు. తన చిన్ననాటి జ్ఞాపకాలతోనే డైరక్టర్ ఈ మూవీ తీశారని చెబుతుంటారు. లాస్ట్ ఫిల్మ్ షో లో భవిన్ రాబరి, భన్వేష్, రిచా మీనా తదితరులు నటించారు. లాస్ట్ ఫిల్మ్ షో వల్లాడోలిడ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించగా గోల్డెన్ స్పైక్ అవార్డ్ అందుకుంది. పాన్ నలిన్ తీసిన ఇదివరకు సినిమాలు సంసారా, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, యాంగ్రీ ఇండియన్ గాడెసెస్ మూవీస్ కూడా ప్రశంసలు అందుకున్నాయి.

95వ అకాడెమీ అవార్డుల బరిలో ఇండియన్ సినిమాల నుంచి ఆర్.ఆర్.ఆర్, కశ్మీర్ ఫైల్స్ సినిమాలు పోటీ పడ్డాయి. అయితే చెల్లో షో (లాస్ట్ ఫిల్మ్ షో)కే ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ ఓటు వేసింది. లాస్ట్ ఫిల్మ్ షో కేవలం గుజరాతీ భాషలోనే కాకుండా అన్ని మేజర్ భాషల్లో అందుబాటులో ఉండేలా నెట్ ఫ్లిక్స్ ప్లాన్ చేస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.