Begin typing your search above and press return to search.

కృష్ణాన‌గ‌ర్ క‌ష్టాలు చూసిన కొరియోగ్రాఫ‌ర్ కి ఆస్కార్ గుర్తింపు!

By:  Tupaki Desk   |   21 March 2023 9:00 PM GMT
కృష్ణాన‌గ‌ర్ క‌ష్టాలు చూసిన కొరియోగ్రాఫ‌ర్ కి ఆస్కార్ గుర్తింపు!
X
రాజ‌మౌళి..కీర‌వాణి అండ్ కో అంతా ఆస్కార్ సంతోషంలో మునిగి తేలుతోన్న సంగ‌తి తెలిసిందే. భార‌తీయ సినిమాకి ఆస్కార్ రావ‌డం..అందులోనూ తెలుగు సినిమాకు అవార్డు ద‌క్క‌డంతో! ఆనందానికి అవ‌ధుల్లేవ్. తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ మ‌రింత పెచింది. ఇప్ప‌టికే గ్లోబ‌ల్ స్థాయిలో తెలుగు సినిమాకి ద‌క్కిన గుర్తింపును ఆస్కార్ రెట్టింపు చేసింది. ప్ర‌పంచ‌మే తెలుగు సినిమావైపు చూసేలా చేసిన లో లెజెండ్ జ‌క్క‌న్న‌. ఇది కేవ‌లం ఆయ‌న వ‌ల్ల మాత్ర‌మే సాధ్య‌మైంద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన వాస్త‌వం.

ఆయ‌న ప‌ట్టుబ‌ట్టి ప్ర‌య‌త్నం చేయ‌క‌పోయుంటే? ఆస్కార్ అనే మాట తెలుగు నాట వినిపించేది కాదేమో. అంత‌టి ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు రావ‌డం వెనుక కొరియోగ్రాఫ‌ర్ ప్రేమ్ ర‌క్షిత్ ప‌నిత‌నం ఎంతో ఉంద‌న్న‌ది వాస్త‌వం. నాటు నాటు పాట‌కు కొరియోగ్ర‌ఫీ చేసింది ఆయ‌న‌.

కొన్ని నెల‌ల పాటు ఆ పాట కోసం త‌న టీమ్ తో క‌లిసి ప‌నిచేసారు. రామ్ చ‌ర‌ణ్‌..ఎన్టీఆర్ లాంటి ఇద్ద‌రు న‌టుల‌తో అలాంటి ఔట్ ఫుట్ తీసుకురావ‌డం అంటే చిన్న విష‌జ్ఞం కాదు. ఎంతో క‌ష్ట‌ప‌డితే గానీ సాధ్యం కానిది. ఇద్ద‌రు మంచి డాన్స‌ర్లు కావ‌డం.. అలాంటి డాన్స‌ర్ల‌కు ప్రేమ్ ర‌క్షిత్ లాంటి క్రియేట‌ర్ దొర‌క‌డంతోనే ఇది సాధ్య‌మైంది.

ఆ పాట‌లో వినియోగించిన కాస్ట్యూమ్స్- బ్యాక్ గ్రౌండ్ సెట‌ప్...డాన్స‌ర్లు అంతా ప‌క్కాగా కుద‌ర‌డంతోనే ఆస్కార్ పంట ప‌డింది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఉత్త‌మ ఒరిజిన‌ల్ సాంగ్ గా ఎంపికవ్వ‌డం వెనుక వీళ్లంద‌రి క‌ష్టం ఉంది. కేవ‌లం నాటు నాటు సాహిత్యానికో..సంగీతానికో అవార్డు ద‌క్కిందంటే? ఆర్ ఆర్ ఆర్ అభిమానులు ఒప్పుకోరు. ఆ పాట‌లో కొరియోగ్ర‌ఫీ అనేది కీల‌క పాత్ర పోషించింది.

బ్యాక్ గ్రౌండ్ లో బ్రిట‌న్ డాన్స‌ర్లు ఉండ‌టం వంటివి ఆస్కార్ జ్యూరీ స‌భ్యుల్ని వ్య‌క్తిగ‌తంగా క‌నెక్ట్ చేసాయి. ఇక ప్రేమ్ ర‌క్షిత్ నేప‌థ్యం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ప‌రిశ్ర‌కొచ్చి కొరియోగ్రాఫ‌ర్ గా ఎదిగిని వాడు. కృష్ణా న‌ర‌గ‌ర్ క‌ష్టాలు తెలిసిన వాడు. 'అక్కడి కష్టాలను చూసినవాడిని. రాజామౌళి ఇంట్లో కార్తికేయ - కాలభైరవ - సింహాలకు నేను డాన్స్ నేర్పేవాడిని. మరో ఇద్దరు కుర్రాళ్లకు కూడా ఇళ్లకు వెళ్లి క్లాసులు తీసుకునేవాడిని.

అలా వచ్చిన డబ్బుతోనే అతికష్టం మీద రోజులు గడుపుతూ వెళ్లేవాడిని. 'సై'- .. 'ఛత్రపతి' - 'విక్రమార్కుడు' - 'మగధీర' ఇలా అన్ని సినిమాలకు రాజ‌మౌళిగారితో ప‌నిచేసాను. నాటు నాటు కి ఆస్కార్ ప్రకటించినప్పుడు మా అందరికీ మాటలు రాలేదు . క‌ళ్లంట నీళ్లు తిరిగాయి' అని అన్నారు ప్రేమ్ ర‌క్షిత్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.