Begin typing your search above and press return to search.

ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్‌ లో మన నాటు నాటు 

By:  Tupaki Desk   |   22 Dec 2022 6:47 AM GMT
ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్‌ లో మన నాటు నాటు 
X
టాలీవుడ్‌ జక్కన్న చూడని రికార్డులు లేవు.. కానీ ఆస్కార్‌ అవార్డు మాత్రమే ఆయన్ను ఊరిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తో ఆ ముచ్చట కూడా తీర్చుకోవాలని ఉబలాట పడుతున్నాడు. దేశం తరపున ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ఆస్కార్ నామినేషన్స్‌ కు చోటు దక్కలేదు. దాంతో చిత్ర యూనిట్‌ సభ్యులు నేరుగా ఆస్కార్‌ బరిలో నిలిచేందుకు సిద్ధం అయ్యారు.

పలు విభాగాల్లో ఆస్కార్‌ అవార్డుల నామినేషన్స్ కోసం రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో జరుగబోతున్న ఆస్కార్‌ అవార్డు వేడుకలకు సంబంధించిన సన్నాహాలు మొదలు అవుతున్నాయి. ఈ సమయంలోనే ఆస్కార్‌ అవార్డుల యొక్క నామినేషన్స్ ను ప్రకటించేందుకు సిద్ధం అయ్యారు.

తాజాగా కొన్ని విభాగాలకు సంబంధించి షార్ట్‌ లిస్ట్‌ ను విడుదల చేశారు. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌ అకాడమీ వారు విడుదల చేసిన షార్ట్‌ లిస్ట్‌ లో మన జక్కన్న సినిమా ఆర్‌ ఆర్‌ ఆర్‌ లోని నాటు నాటు చోటు దక్కించుకుంది. అకాడమీ వారు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది.

2023 ఆస్కార్‌ అవార్డుల నామినేషన్స్ జాబితాలో కచ్చితంగా ఏదో ఒక్కటి లేదా రెండు విభాగాల్లో అయినా ఆర్ ఆర్‌ ఆర్ ఉంటుందని అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. తాజాగా ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్ కేటగిరీ షార్ట్‌ లిస్ట్‌ లో మన నాటు నాటు చోటు దక్కించుకోవడంతో కచ్చితంగా నామినేషన్ ను కూడా దక్కించుకునే అవకాశం ఉంది అంటున్నారు.

కీరవాణి సంగీతం అందించిన ఈ నాటు నాటు పాట కోసం ఇద్దరు హీరోలు ఏ స్థాయిలో డాన్స్ చేశారో మనం చూశాం. బెస్ట్‌ కొరియోగ్రఫీ కి కూడా ఈ పాటకు అవార్డు రావాలంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

ఆస్కార్‌ అవార్డుల యొక్క షార్ట్‌ లిస్ట్‌ లో నాటు నాటు చోటు సంపాదించుకున్న నేపథ్యంలో ముందు మరింత సంచలనాలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని.. ఆస్కార్‌ నామినేషన్స్ లో కూడా మన ఆర్ ఆర్ ఆర్‌ విభాగాలు దక్కించుకునే అవకాశం ఉందని అంతా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆసక్తిగా ఆస్కార్‌ నామినేషన్స్ కోసం వెయిట్‌ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.