Begin typing your search above and press return to search.
ఆస్కార్ అప్‌డేట్.. రాజమౌళి అనుకున్నది సాధించినట్లేనా?
By: Tupaki Desk | 9 Dec 2022 4:12 AM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్‌ఆర్ఆర్ సినిమా ఇండియన్ సినీ ప్రేక్షకులను ఊరిస్తూ ఉంది. గత ఏడాది కాలంగా ఈ సినిమా వార్తల్లో నిలుస్తూనే ఉంది. సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో విడుదల కాకముందే జనాలు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు సినిమా యొక్క ఆస్కార్ నామినేషన్స్ గురించి చర్చించుకుంటున్నారు.
భారత్ తరపున అధికారికంగా ఆస్కార్ లో నామినేషన్స్ ను దక్కించుకోలేక పోయిన ఆర్ఆర్ఆర్ సినిమా ను పట్టుదలతో రాజమౌళి సొంతంగా నామినేషన్స్ కు పంపించిన విషయం తెల్సిందే. ఇలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కడం ఎంతో గౌరవంగా భావిస్తూ ఉంటారు. ఆస్కార్ వచ్చినా రాకున్నా కూడా నామినేట్ అవ్వడం గొప్ప విషయం. అందుకే మన ఇండియన్ సినిమాకు ఆ ఛాన్స్ దక్కుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.
రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాను ఆస్కార్ బరిలో నిలిపేందుకు అమెరికా సహా పలు దేశాల్లో చాలా మీడియా సమావేశాలు నిర్వహించాడు.. పలు అంతర్జాతీయ సినీ వేదికల మీద ఈ సినిమా గురించి ప్రస్థావన వచ్చే విధంగా ప్లాన్ చేశారు. పదుల కొద్ది ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించారు. అంతర్జాతీయ స్థాయి మీడియా దృష్టిని ఆకర్షించడంతో పాటు ఇంకా ఎన్నో పనులు చేశారు.
తాజాగా ఒక అంతర్జాతీయ స్థాయి మీడియా సంస్థ తన కథనంలో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఆస్కార్ నామినేషన్స్ దక్కే అవకాశం ఉంది అన్నట్లుగా కథనాన్ని రాసుకొచ్చింది. రెండు కేటగిరీల్లో ఈ సినిమా నామినేషన్స్ ను దక్కించుకుంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది.
రాజమౌళి ఆస్కార్ నామినేషన్స్ కోసం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద మొత్తంలో డాలర్లను ఖర్చు చేస్తున్నారు అంటూ కూడా పుకార్లు చేస్తున్నాయి. తన గురించి మరియు సినిమా గురించి భారీగా పబ్లిసిటీ చేసేందుకు ప్రమోషన్ సంస్థలతో లక్షల్ల రూపాయలు ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడని తెలుస్తోంది. మొత్తానికి వచ్చే నెలలో ప్రకటించబోతున్న ఆస్కార్ నామినేషన్స్ లో మన ఆర్ ఆర్ ఆర్ ఉండటం కన్ఫర్మ్ అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో జక్కన్న అనుకున్నది సాధించినట్లే అన్నట్లుగా ఆయన అభిమానులు ధీమాతో ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.