Begin typing your search above and press return to search.
ఆస్కార్ విన్నర్ కు మన నిర్మాత చుక్కలు చూపబోతున్నాడట
By: Tupaki Desk | 15 Feb 2020 4:30 PM GMTప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆస్కార్ అవార్డుల మహోత్సవం అద్బుతంగా.. అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. ఆస్కార్ ఉత్తమ చిత్రం మెయిన్ కెటగిరీలో ఎప్పుడు కూడా ఇంగ్లీష్ మూవీ నిలిచేది. కాని ఆస్కార్ చరిత్ర లో మొదటి సారి ఒక ఇంగ్లీషేతర మూవీ ఆస్కార్ మెయిన్ స్ట్రీమ్ ఉత్తమ చిత్రం అవార్డును దక్కించుకుంది. అదే పారాసైట్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు అవార్డులను దక్కించుకున్న ఈ కొరియన్ మూవీ మేకర్స్ కు మన ఇండియన్ నిర్మాత చుక్కలు చూపించేందుకు సిద్దం అయ్యాడు.
పారసైట్ మూవీ అవార్డులు దక్కించుకున్న తర్వాత చాలా మంది ఆ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించారు. కొందరు తమిళ ఆడియన్స్ ఆ సినిమా చూసిన తర్వాత దీని కథ మన విజయ్ హీరోగా కేఎస్ రవికుమార్ తెరకెక్కించిన మిన్సార కన్నా కథకు దగ్గరగా ఉందని అన్నారు. ఆ ప్రచారంతో పారసైట్ మూవీని చాలా మంది చూశారు. చివరకు తమిళ నిర్మాత తేనప్పన్ కూడా చూసి తన సినిమాను అనుమతి తీసుకోకుండా రీమేక్ చేశారంటూ నిర్థారణకు వచ్చాడు.
తన సినిమా కాపీ రైట్స్ ను చోరీ చేసినందుకు గాను పారసైట్ ప్రొడక్షన్ టీంకు నోటీసులు ఇచ్చేందుకు తేనప్పన్ సిద్దం అయ్యాడు. అంతర్జాతీయ స్థాయిలో ఒక న్యాయవాదితో చర్చలు కూడా జరుపుతున్నాడట. అంతర్జాతీయ న్యాయ స్థానంకు ఈ కేసును తీసుకు వెళ్లేందుకు తేనప్పన్ సిద్దం అవుతున్నాడు. ఆస్కార్ అవార్డులు నాలుగు వచ్చాయని సంతోషంగా ఉన్న పారసైట్ చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పుడు కాపీ రైట్ ఇష్యూ మొదలు అవ్వడంతో కంగారు పడుతున్నారట. దీన్ని ఆఫ్ ది రికార్డ్ రాజీ కుదుర్చుకుంటే మంచిదనే ఉద్దేశానికి వారు వచ్చే అవకాశాలున్నాయట. ఈ వివాదం ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి.