Begin typing your search above and press return to search.
బ్రూస్ లీ బయోపిక్ లో ఆంగ్ లీ వారసుడు!
By: Tupaki Desk | 2 Dec 2022 1:55 AM GMTచైనీస్ అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ బ్రూస్ లీ జీవిత రహస్యాలను వెండితెరకెక్కించే ప్రయత్నం సాగుతోంది. లీ జీవితంలో నగ్న సత్యాలను బయటి ప్రపంచానికి బహిర్గతం చేసే భారీ యాక్షన్ చిత్రానికి ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ఆంగ్ లీ దర్శకత్వం వహించనున్నారు.
ఆంగ్ లీ పేరు వినగానే తొలిగా గుర్తుకొచ్చే సినిమా 'లైఫ్ ఆఫ్ పై'. సముద్రం నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే కథాంశం అద్భుత విజువల్స్ తో కట్టి పడేసే సినిమా ఇది. ఈ చిత్రం అప్పట్లో పలు ఆస్కార్ అవార్డుల్ని కొల్లగొట్టింది. ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ గా ఆంగ్ లీకి గొప్ప గుర్తింపు గౌరవం దక్కాయి. ఆయన దృష్టి ఇప్పుడు చైనీస్-అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ బ్రూస్ లీ జీవితకథపై పడింది.
లీ బయోపిక్ కి దర్శకత్వం వహించడమే గాక.. ఈ చిత్రంలో తన కుమారుడు మాసన్ లీని కథానాయకుడి పాత్రకు ఎంపిక చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. మాసన్ లీ ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నాడు. బ్రూస్ లీ బయోపిక్ స్క్రిప్టు 'సోనీ అండ్ 3000 పిక్చర్స్'లో అభివృద్ధి దశలో ఉంది. డాన్ ఫుటర్ మాన్ స్క్రిప్ట్ ను అడాప్ట్ చేస్తుండగా.. జీన్ కాస్టెల్లి- అలెక్స్ లా- మాబెల్ చియుంగ్ - వెల్స్ టవర్ స్క్రీన్ ప్లే విభాగాలను రాశారు.
పూర్తిగా అమెరికన్ లేదా పూర్తిగా చైనీస్ కాని అసాధారణ ప్రతిభావంతుడు బ్రూస్ లీ ప్రపంచానికి చైనీస్ కుంగ్ ఫూను పరిచయం చేసిన తూర్పు పశ్చిమాలకు వారధిగా నిలిచారు. అసాధారణ పోరాట విన్యాసాల నిపుణుడిగా.. యుద్ధ కళలతో యాక్షన్ సినిమాలలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన సెన్సేషనల్ నటుడిగా బ్రూస్ లీ పేరు నాటి రోజుల్లో మార్మోగింది. ఇప్పుడు అతడి బయోపిక్ ని లైఫ్ ఆఫ్ పై సహా ఎన్నో సంచలన చిత్రాలను అవార్డులు కొల్లగొట్టిన చిత్రాలను తెరకెక్కించిన ఆంగ్ లీ తెరకెక్కిస్తుండడం ఒక్కసారిగా ఉత్కంఠను పెంచుతోంది.
ఒక అసాధారణమైన మార్షల్ ఆర్ట్స్ నిపుణుడి కథను తెరపై చెప్పేందుకు ఆసక్తిగా ఉన్నానని ఆంగ్ లీ తాజా ప్రకటనలో వెల్లడించారు. బ్రూస్ లీ 135-పౌండ్-ఫ్రేమ్ లో అద్భుతమైన శక్తివంతుడు. అవిశ్రాంతంగా కష్టపడి అసాధ్యమైన కలలను నిజం చేసుకున్న రియల్ హీరో అతడు. ఈ ప్రతిష్ఠాత్మక బయోపిక్ కి లారెన్స్ గ్రే - షానన్ లీ- ఆంగ్ లీ- బెన్ ఎవెరార్డ్- బ్రియాన్ బెల్ నిర్మాతలుగా భారీ పెట్టుబడుల్ని సమకూరుస్తున్నారు. ఎలిజబెత్ గాబ్లర్ సంస్థ - మారిసా పైవా స్టూడియోస్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ను పర్యవేక్షిస్తున్నాయి. గేబ్లర్- పైవాలతో కలిసి సోనీ పిక్చర్స్ చైర్మన్ టామ్ రోత్ మన్ గతంలో ఆంగ్ లీ 'లైఫ్ ఆఫ్ పై'కి పనిచేశారు. బ్రూస్ లీ బయోపిక్ తో ఈ కలయిక రిపీటవుతోంది.
బ్రూస్ లీ బయోపిక్ ఆంగ్ లీకి దీర్ఘకాల ప్రణాళికతో కూడుకున్న అభిరుచి గల ప్రాజెక్ట్. మన జనరేషన్ లోని నిజ జీవిత యాక్షన్ హీరోలలో ఒక అసాధారణ వ్యక్తి విజయాలు సంఘర్షణలను వర్ణించే ఘాడమైన భావోద్వేగపూరితమైన కథను తెరపై ఆవిష్కరించనున్నామని లీ తెలిపారు. సోనీ అండ్ 3000 పిక్చర్స్ బ్యానర్ కర్తలంతా కలిసి ఆంగ్ లీ అతని నిర్మాణ బృందం ప్రయత్నానికి సహకరిస్తున్నారు. అసాధారణమైన థియేట్రికల్ సినిమాలను తెరకెక్కించే గొప్ప ప్రతిభావంతుడైన లీకి సహాయం చేసే బృందంలో ఉన్నందుకు గర్విస్తున్నామని సహనిర్మాతలు తెలిపారు.
ఆంగ్ లీ తెరకెక్కించిన సినిమాల్లో బ్రోక్ బ్యాక్ మౌంటైన్- క్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్- సెన్స్ అండ్ సెన్సిబిలిటీ - హల్క్- లస్ట్ - బిల్లీ లిన్ లాంగ్ హాఫ్ టైమ్ వాక్ సంచలన చిత్రాలుగా రికార్డులకెక్కాయి. వీటిలో పలు చిత్రాల్లో మాసన్ లీ కూడా నటించారు. అలాగే మాసన్ లీ 'ది హ్యాంగోవర్ పార్ట్ II'లో కూడా కనిపించాడు. ఇటీవల తైవానీస్ రొమాంటిక్ కామెడీ స్టాండ్ బై మీ- హాంగ్ కాంగ్ డ్రామా లింబో - హూ కిల్డ్ కాక్ రాబిన్ చిత్రాల్లోను మాసన్ లీ నటించాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.