Begin typing your search above and press return to search.
సితార మీద గుర్రుగా ఉన్న ఇతర పెద్ద బ్యానర్లు..?
By: Tupaki Desk | 4 Jan 2022 3:30 PM GMTప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థల్లో 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' మరియు దాని అనుబంధ సంస్థగా 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్లను పేర్కొనవచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసే సినిమాలన్నీ ఒక బ్యానర్ లో.. మిగతా సినిమాలన్నీ మరో బ్యానర్ మీద నిర్మిస్తూ వస్తున్నారు.
ఓవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఎప్పటికప్పుడు ఇండస్ట్రీకి యంగ్ టాలెంట్ ని పరిచయం చేయడానికి కృషి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో వరుస విజయాలు అందుకుంటూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ గా.. మంచి అభిరుచి గల నిర్మాతలుగా పేరుతెచ్చుకున్నారు నిర్మాతలు రాధాకృష్ణ (చినబాబు) - సూర్య దేవర నాగవంశీ.
ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తరువాత సితార ఎంటర్ టైన్మెంట్స్ ఫుల్ స్వింగ్ లో ఉందని చెప్పాలి. సినిమాలు మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు ఈ బ్యానర్ హెడ్ నాగ వంశీ. ఏవో సినిమాలు చేసేశాం అనే ధోరణిలో కాకుండా.. మంచి కాంబినేషన్స్ సెట్ చేసుకుంటూ క్రేజీ సినిమాలే చేస్తున్నాడు. ప్రస్తుతం సితార బ్యానర్ లో ప్రస్తుతం అర డజనుకు పైగా సినిమాల నిర్మాణం జరుగుతున్నాయంటేనే నిర్మాతలు ఎంత బిజీగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
దీంతో ఇప్పుడు రేసులో మిగతా పెద్ద బ్యానర్లు వెనుకన పడిపోయాయనే కామెంట్స్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. అంతేకాదు రిలీజ్ డేట్లు - షూట్ డేట్లు విషయంలో చాలా మంది క్రేజీ హీరోలు సితార ఎంటర్టైన్మెంట్స్ వద్దే లాక్ అయిపోవడంతో.. మిగతా నిర్మాతలు కాస్త వీరిపై అసహనం వ్యక్తం చేస్తున్నారని టాక్ నడుస్తోంది.
నాగవంశీ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి హీరోలుగా 'భీమ్లా నాయక్' సినిమా తెరకెక్కుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రొడక్షన్ తో కలిసి యువ హీరో నవీన్ పొలిశెట్టి తో ఓ మూవీ అనౌన్స్ చేశారు.
అలానే తమిళ స్టార్ హీరో ధనుష్ ను తెలుగులోకి పరిచయం చేసే బాధ్యత సితార టీమ్ తీసుకుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' అనే బైలింగ్విల్ ప్రాజెక్ట్ ని లేటెస్టుగా సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఇక తమ బ్యానర్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన 'జెర్సీ' చిత్రాన్ని మరికొందరు నిర్మాతలతో కలిసి హిందీలో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ హీరోగా రూపొందిన ఈ సినిమా విడుదల కరోనా నేపథ్యంలో వాయిదా పడింది.
ఇలా 'సార్' 'జెర్సీ' సినిమాలతో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఇప్పుడు తమిళం మరియు హిందీ ఇండస్ట్రీలలో అడుగుపెడుతోంది. అలానే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో చేయబోయే చిత్రాన్ని కుదిరితే పాన్ ఇండియా స్థాయిలో రూపొందించాలని చూస్తున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇక సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'డీజే టిల్లు' సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సితార బ్యానర్ లో మలయాళంలో ఘన విజయం సాధించిన 'కప్పెల' తెలుగు రీమేక్ కూడా రూపొందనుంది. ఇందులో సిద్ధు - 'మాస్టర్' ఫేమ్ అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీటితోపాటు సితార బ్యానర్ లో మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని తెలుస్తోంది.