Begin typing your search above and press return to search.
ఆ నలుగురు.. అందులో ఎవరు?
By: Tupaki Desk | 26 April 2018 5:04 AM GMTవిఖ్యాత నటుడు - తన తండ్రి అయిన నందమూరి తారక రామారావు జీవితగాథతో బాలకృష్ణ తీస్తున్న సినిమా డైరెక్షన్ బాధ్యతల నుంచి తేజ పక్కకు తప్పుకొన్నాడు. చాలా రోజుల నుంచి ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు చూస్తున్న సడెన్ గా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ కథకు తాను సరైన న్యాయం చేయలేనని తేజ చెప్పినా కొన్ని విషయాల్లో హీరో బాలకృష్ణతో ఏకీభవించలేక బయటికొచ్చారని టాలీవుడ్ లో వినిపిస్తున్న ఇన్ సైడ్ టాక్.
తేజ పక్కకు తప్పుకున్నాక ఇప్పుడు ఈ సినిమా బాధ్యతలు బాలయ్య ఎవరి చేతుల్లో పెడతాడన్నది ఇంటరెస్టింగ్ గా మారింది. బాలకృష్ణ ప్రస్తుతం నలుగురు డైరెక్టర్ల పేర్లు పరిశీలిస్తున్నాడని తెలుస్తోంది. సీనియర్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు - పి.వాసు - కృష్ణ వంశీ - పూరి జగన్నాథ్ లలో ఎవరో ఒకరిని ఎంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ నలుగురూ ప్రస్తుతం ఎలాంటి సినిమాలూ డైరెక్ట్ చేయడం లేదు. పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరిని హీరోగా పెట్టి మెహబూబూ సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా పనులు కూడా చివరి దశకొచ్చాయి. కాబట్టి బాలయ్య నుంచి ఎవరికి పిలుపు వచ్చినా కాదనే పరిస్థితి ఉండదు.
ఈ నలుగురు డైరెక్టర్లలో ఇంతవరకు అస్సలు బాలకృష్ణతో సినిమా చేయనిది కృష్ణవంశీ మాత్రమే. ప్రస్తుతం ఫామ్ లో లేని డైరెక్టర్ కూడా ఆయనే. మిగిలిన ముగ్గురికీ బాలయ్యను డైరెక్ట్ చేసిన అనుభవముంది. మరి ఆ నలుగురిలో ఎవరు డైరెక్టర్ ఛైర్ లోకి వస్తారో.. లెట్స్ వెయిట్ అండ్ సీ.