Begin typing your search above and press return to search.

ఒత్త సెరుప్పు.. ఎవరు పొందుతారు మెప్పు!

By:  Tupaki Desk   |   9 Nov 2021 3:30 AM GMT
ఒత్త సెరుప్పు.. ఎవరు పొందుతారు మెప్పు!
X
ఒత్త సెరుప్పు సైజ్ 7. తమిళంలో విజయం సాధించి, విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్న ఎక్స్‌పెరిమెంటల్ మూవీ ఇది. ఓ మర్డర్‌‌ కేసు గురించి ఒక వ్యక్తిని లాకప్‌లో ఇంటరాగేషన్ చేయడమే కథ. ఆర్‌‌.పార్థిబన్ రాసిన ఈ కథలో ఒకే ఒక్క పాత్ర ఉంటుంది. దాన్ని ఆయనే పోషించారు. ఆయనే నిర్మించారు. ఆయనే దర్శకత్వమూ వహించారు. తన అద్భుత నటనకి, టేకింగ్‌కి నేషనల్ అవార్డ్ అందుకున్నారు. సౌండ్ డిజైన్ విభాగంలో రసూల్ పూకుట్టికి కూడా జాతీయ అవార్డు వచ్చింది. ఒక వ్యక్తి ఆల్‌రౌండర్‌‌గా తీసిన ఈ చిత్రం ఏషియా బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లోకి కూడా ఎక్కింది.

2019లో వచ్చిన అంత గొప్ప సినిమాని ఇప్పుడు హిందీలోకి, తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నం విమర్శలు మూటగట్టుకుంటోంది. బాలీవుడ్‌లో అభిషేక్ బచ్చన్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుందని ప్రకటించగానే ప్రేక్షకులు పెదవి విరిచారు. ఎందుకంటే అభి సక్సెస్‌ఫుల్ యాక్టర్ కాదు. ఒక టైప్ ఆఫ్ రోల్స్ తప్ప అన్ని రకాల పాత్రలూ పండించలేడనే కామెంట్స్‌ తనపై మొదట్నుంచీ ఉన్నాయి. అలాంటిది ఇంత డెప్త్ ఉన్న రోల్ ఎలా చేస్తాడనే సందేహం వ్యక్తమవుతోంది. అయితే స్వయంగా పార్థిబనే తీస్తున్నారు కాబట్టి తనకు కావలసినదాన్ని రాబట్టుకుంటారనే నమ్మకం ఏ మూలో ఉంది. నిజానికి ఆయన మొదట నవాజుద్దీన్ సిద్దిఖీతో తీయబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఏం జరిగిందో ఏమో.. సినిమా సెట్స్కి వెళ్లేసరికి నవాజ్ ప్లేస్‌లోకి అభిషేక్ వచ్చాడు.

ఇక తెలుగులో ఈ సినిమా ‘డేగల బాబ్జి’గా తెరకెక్కుతోంది. వెంకట్ చంద్ర డైరెక్షన్‌లో ఎస్.స్వాతి నిర్మిస్తున్నారు. టైటిల్‌ రోల్‌ని బండ్ల గణేష్‌ పోషిస్తున్నాడు. తాజాగా ట్రైలర్‌‌ కూడా రిలీజయ్యింది. గణేష్ తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నట్టే అనిపిస్తోంది. అయితే ఈ కాన్సెప్ట్‌తోనే పెద్ద సమస్య ఉంది. ఒకే పాత్ర. దాన్ని చూడటానికే ప్రేక్షకులు తెర ముందు కూర్చోవాలి. చివరికి వరకు సీటు నుంచి లేవకుండా చేయాలంటే ఆ పాత్ర పోషించే నటుడు బాగా నటిస్తే చాలు. ఎక్స్ట్రార్డినరీగా చేయాలి.

పార్థిబన్ మంచి నటుడిగా మెప్పు పొందినవాడు. బేసిగ్గా దర్శకుడు కూడా కావడంతో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి అటెన్షన్ పొందగలిగాడు. కానీ అభిషేక్ ఇంత ఎమోషనల్‌ రోల్‌కి సూట్ కాడని అతని కెరీర్ గ్రాఫ్‌ చూసినవాళ్లెవరైనా చెప్పేస్తారు. ఇక గణేష్‌ కూడా కమెడియన్‌గానే అందరికీ దగ్గరయ్యాడు. సీరియస్ రోల్స్లో తనని చూసింది తక్కువే. మరి వీళ్లిద్దరూ ఎన్నో వేరియేషన్స్‌ ఉన్న ఈ ఎమోషనల్‌ రోల్‌కి ఎలా న్యాయం చేస్తారు, దాదాపు రెండు గంటల సేపు ప్రేక్షకుల్ని ఎలా కట్టి పడేస్తారు. అసలు ఆ పాత్రలో వీరిని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేదే పెద్ద ప్రశ్న. అందరి అభిప్రాయం తప్పని వీళ్లు ప్రూవ్ చేస్తే పర్లేదు. లేదంటే ఓ గొప్ప చిత్రాన్ని చెడగొట్టారనే చెడ్డ పేరు మూటగట్టుకోవాల్సి వస్తుంది.