Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: స‌్టార్ డమ్ కి ఎండ్ కార్డ్
By: Tupaki Desk | 27 July 2020 11:30 PM GMTఇన్నాళ్లు పెద్ద హీరో చిన్న హీరో అనే అంతరం ఉండేది. పెద్ద తెర వల్ల పుట్టుకొచ్చినదే ఇదంతా. కానీ ఇప్పుడు అంతా తారుమారవుతోంది. ఇకపై పెద్ద తెరకు ప్రాధాన్యత తగ్గి ఓటీటీ- డిజిటల్ కి ప్రాధాన్యత పెరిగితే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? అన్నదానిపై విశ్లేషణ సాగుతోంది. థియేట్రికల్ రిలీజ్ తో పోలిస్తే ఓటీటీ వేదిక చాలా భిన్నమైనదని ప్రూవ్ అవుతోంది. ఇటీవల ఓటీటీలో రిలీజైన కొన్ని సినిమాల ఫలితాల్ని చూస్తుంటే ఓటీటీ వేదికపై చిన్న హీరో .. పెద్ద హీరో అనే తేడా ఉండదని ప్రూవైంది.
కలెక్షన్ల పరంగా జనాదరణ పరంగా స్టార్ ఎవరు? అన్నది జనం చూడరని.. సినిమా కంటెంట్ నచ్చితే ఎవరికైనా ఆదరణ దక్కుతుందని చెప్పడానికి మొన్న రిలీజైన `దిల్ బెచారా` అనే సినిమానే ఎగ్జాంపుల్. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ఈ సినిమా ఓటీటీ వేదికపై విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా నిర్మాతలకు సంతృప్తికరమైన ఫలితాన్ని ఇచ్చింది. గొప్ప జనాదరణ పొందుతోంది.
అసలు ఏ స్టార్ నటించిన సినిమా అయినా తొలి మూడు రోజుల వరకూ ఒకలా.. ఆ తర్వాత ఇంకోలా వసూళ్లు సాధించడం చూస్తున్నదే. తొలి వీకెండ్ తర్వాత ఒక పెద్ద స్టార్ సినిమాకి కలెక్షన్లు ఉంటాయి. కానీ చిన్న హీరోలకు అంత సీన్ ఉండదు. కానీ ఇప్పుడు ఓటీటీ వేదికకు అలాంటి తారతమ్యాలేవీ లేవు. అంతరాలు అసలే పట్టవు. సినిమా బావుంటే వసూళ్లు వస్తాయి అంతే. ఓటీటీ ఒక రకంగా స్టార్ పవర్ అనే పదాన్ని చంపేస్తుందని భావిస్తున్నారు. సుశాంత్ సింగ్ మరణానంతరం రిలీజైన దిల్ బెచారా విషయంలో క్రిటిక్స్ సైలెన్స్ వల్ల ఇలా వసూళ్లు దక్కాయా? సింపథీ ఏదైనా వర్కవుటైందా? అంటే అది కొంతవరకేనని తేలింది. దిల్ బెచారా ఇప్పటికీ చక్కని ఆదరణ దక్కించుకుంటోంది.
ఈ చిత్రం `లక్ష్మీ బాంబ్` .. `భుజ్ - ది ప్రైడ్ ఆఫ్ ఇండియా` వంటి స్టార్ పవర్ ఉన్న సినిమాలతో పోలిస్తే ది బెస్ట్ అని ప్రూవ్ చేసింది. అలాగే థియేట్రికల్ రిలీజ్ తో పోల్చి చూస్తే ఓటీటీ కలెక్షన్స్ విషయంలో క్లారిటీ ఉండదు. అక్కడ కలెక్షన్స్ ఇంత వచ్చాయి అంత వచ్చాయి అని ప్రచారం చేసుకోవడానికి ఏమీ ఉండదు. దీనివల్ల కూడా స్టార్ పవర్ అన్నది నాశనమవుతుందనేది ఓ అంచనా. స్టార్ హీరోలు ఇకపై ఓటీటీ మార్గాన్నే ఎంచుకుంటే దీనివల్ల స్టార్ డమ్ అనే పదం అంతమైనా ఆశ్చర్యపోనక్కర్లేదన్నది కొందరి విశ్లేషణ. స్టార్ హీరో అన్న మాటే అంతమైతే అప్పుడు సినీపరిశ్రమలు ఎలా మనుగడ సాగిస్తాయి? అన్నది ఆసక్తికర పరిణామమే.