Begin typing your search above and press return to search.
#OTT ట్రెండ్స్.. ఫోకస్ అంతా ఈ సిరీస్ లపైనే
By: Tupaki Desk | 15 Aug 2021 3:31 PM GMTఏడాదిన్నర కాలంగా ఓటీటీ లు వినోదానికి ప్రధాన వేదికగా మారాయి. థియేటర్లకు ప్రత్యామ్నాయంగా డిజిటల్ వేదికలపై ప్రేక్షకులు వినోదాన్ని ఆస్వాధిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలు.. వెబ్ సిరీస్ లు సినీ ప్రియులకు ప్రధాన వినోదంగా మారాయి. అయితే థియేట్రికల్ హవాని ఓటీటీలు ఎప్పటికీ బర్తీ చేయలేవనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికీ నిర్మాతలు థియేటర్ రంగంపై నే నమ్మకంగా ఉన్నారు.
సెకండ్ వేవ్ తాకిడి అనంతరం ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకోవడంతో ఓటీటీలకు కొంతమేర ట్రాఫిక్ తగ్గిందని తెలుస్తోంది. అయినా మెజారిటీ సినిమాలన్నీ ఓటీటీలోనే రిలీజ్ అవుతుండం ఈ మాధ్యమానికి క్రేజు తగ్గనివ్వడం లేదు. ఇక ఈ వారం ఓటీటీల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే చిత్రాలు..సిరీస్ లు గురించి మాట్లాడుకుంటే.. అవంతిక వందనపు.. అభయ్ డియోల్.. మీరా సియల్ ప్రధాన పాత్రల్లో మంజరి మకిజానీ దర్శకత్వం వహించిన `స్పిన్ ` అనే వెబ్ సిరీస్ ఆగస్టు 15న డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అవుతుంది. అనుకోకుండా ఒక యువకుడు అమెరికన్ డీజేతో ప్రమలో పడతాడు. అతను పూర్తిగా ఆమెతో కలిసి సంగీతం ప్రయాణంలోనే కొనసాగుతాడు. ఇలా రెండు దేశాల మనుషుల మధ్య ప్రేమకథ ఎలా సాగిందన్న కథను ఆసక్తికరంగా చూపించబోతున్నారు. ఇది టీనేజ్ లవ్ స్టోరి.
అలాగే `ఇండియా షాయారీ ప్రాజెక్ట్` అనే సిరీస్ జీ-5 లో రిలీజ్ అవుతుంది. ఇందులో కౌసర్ మునీర్.. కుమార్ విశ్వాస్.. జాకీర్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారతదేశ కవితా రత్నాలు కౌసర్ మునీర్.. కుమార్ విశ్వాస్.. జాకీర్ ఖాన్ 90 నిమిషాల్లో ఓ ప్రదర్శన ఇస్తారు. దీనిలో వారు భావ ప్రకటనా స్వేచ్ఛ అంటే ఏమిటో వారి అభిప్రాయాలను పంచుకుంటారు. కొత్త యుగంలో భావవ్యక్తీకరణకు శక్తివంతమైన సాధనంగా మారడానికి కవిత్వం నిజమైన సమయ పరీక్షగా ఎలా జీవించిందనే దానిపై కూడా వారు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఆద్యంతం ఆసక్తికరంగా సిరీస్ కొనసాగుతుంది. అలాగే `డైరీ ఆఫ్ ఏ ఫ్యూచర్ ప్రెసిడెంట్ సీజన్- 2` వెబ్ సిరీస్ డిస్నీ.. హాట్ స్టార్ ఆగస్టు 18 నుంచి లైవ్ అవుతుంది. ఇందులో టెస్ రొమెరో.. గినా రోడ్రిగెజ్..సెలెనిస్ లెవ్య నటించారు. క్యూబా-అమెరికన్ అమ్మాయి ఒకరోజు అమెరికా అధ్యక్షురాలు అవుతుంది. ఆ తర్వాత సాగే కథ ఆసక్తికరం. ఈ సిరీస్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.
అలాగే `నైన్ పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్` వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఇదే నెల 18 నుంచి లైవ్ అవుతోంది. ఇందులో నికోల్ కిడ్ మన్... మెలిస్సా మెక్ కార్తీ.. ల్యూక్ ఎవాన్స్ నటించగా జోనాథన్ లెవిన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ ఆస్ట్రేలియన్ రచయిత లియాన్ మోరియార్టీ నుండి వచ్చిన న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ పుస్తకం ఆధారంగా రూపొందించారు. `నేత్రికన్` సినిమా డిస్నీ హాట్ స్టార్ లో ఆగస్టు 18న రిలీజ్ అవుతుంది. ఇందులో నయనతార- అజ్మల్ జంటగా నటించారు. మిలింద్ రావు దర్శకత్వం వహించారు. ఇది కొరియన్ మూవీకి రీమేక్ రూపం. అలాగే `కామెడీ ప్రీమియర్ లీగ్` అనే షో నెట్ ఫ్లిక్స్ లో ఆగస్టు 20న రిలీజ్ అవుతుంది. ఇందులో మల్లికా దువా- తన్మయ్ భట్- ప్రజాక్త కోలి నటించారు. ఓ.ఎమ్.ఎల్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని రూపొందించింది. ఇది చక్కని కామెడీ ఎంటర్ టైనర్. ఇది ఓ గేమ్ షో చుట్టూ ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే షో.
`స్వీట్ గర్ల్` అనే మరో షో నెట్ ఫ్లిక్స్ లో ఆగస్టు 20న రిలీజ్ కానుంది. ఇందులో జాసన్ మోమోవా- ఇసాబెల్లా మెర్సిడ్- మాన్యువల్ గార్సియా-రల్ఫ్ నటించగా బ్రియాన్ ఆండ్రూ మెండోజా దర్శకత్వం వహించారు. స్వీట్ గర్ల్ తన భార్య హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన వినాశనానికి గురైన రే రే కూపర్ ని అనుసరిస్తుంది. అతను తన కుమార్తెను స్వీట్ గర్ల్ నుంచి కాపాడుకునే స్టోరీ ఇది. `అన్నెట్` అనే సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఇదే నెల 20న రిలీజ్ అవుతుంది. ఇందులో ఆడమ్ డ్రైవర్.. మారియన్ కోటిల్లార్డ్ సైమన్ హెల్బర్గ్ నటించారు. లియోస్ కరాక్స్ దర్శకత్వం వహించారు. ఇది చక్కని కుటుంబ కథా చిత్రం. థ్రిల్లింగ్ అంశాలతో ఆసక్తికరంగా సాగుతుంది.