Begin typing your search above and press return to search.

మెగాస్టార్ సినిమాకు డెడ్ లైన్ విధించిన ఓటీటీ దిగ్గ‌జం

By:  Tupaki Desk   |   3 May 2022 9:34 AM GMT
మెగాస్టార్ సినిమాకు డెడ్ లైన్ విధించిన ఓటీటీ దిగ్గ‌జం
X
మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలి సారి క‌లిసి న‌టించిన చిత్రం `ఆచార్య‌` ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. చిరు నుంచి దాదాపు సినిమా వ‌చ్చి దాదాపు రెండేళ్లు దాటింది. ఈ నేప‌థ్యంలో `ఆచార్య‌` మూవీపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు అభిమాన‌లు. అంతే కాకుండా డ‌బుల్ బొనాంజా అన్న‌ట్టుగా ఇందులో ఇద్ద‌రు స్టార్ లు చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించ‌డంతో ఒకే స్క్రీన్ పై ఇద్ద‌రు స్టార్ల‌ని చూసి సెల‌బ్రేట్ చేసుకోవాల‌న్న ఆనందం అభిమానుల్లో క‌నిపించింది. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ డైరెక్ట్ చేసిన సినిమా విడుద‌లై నాలుగేళ్లు కావ‌స్తున్న నేప‌థ్యంలో ఆయ‌న అభిమానులు కూడా ఆశ‌గా ఎదురు చూశారు.

అయితే వారి అంచ‌నాల‌ని ఈ మూవీ త‌ల‌కిందులు చేసి తీవ్రంగా నిరాశ ప‌రిచింది. తొలి రోజే డివైడ్ టాక్ రావ‌డం, ఫ్యాన్స్ కూడా అంతృప్తిని వ్య‌క్తం చేయ‌డంతో ఈ సినిమా తీవ్ర స్థాయిలో న‌ష్టాల‌ని చ‌వి చూడ‌టం ఖాయం అని ట్రేడ్ వ‌ర్గాలు విశ్లేశించ‌డం మొద‌లు పెట్టాయి. వారి అంచ‌నాల ప్ర‌కారం ఈ చిత్రాన్ని కొన్న వారికి దాదాపు 100 కోట్ల మేర న‌ష్టాలు త‌ప్ప‌వ‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. చిరు కెరీర్ లో ఈ స్థాయి డిజ‌స్ట‌ర్‌గా నిలుస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. అభిమాన‌లు అయితే ఈ సినిమాని ఓ రేంజ్ లో ఊహించుకున్నారు.

కానీ వారి అంచ‌నాల‌కు భిన్నంగా `ఆచార్య‌` భారీ డిజాస్ట‌ర్ గా నిలిచి చిరుతో పాటు ప్ర‌తీ ఒక్క‌రికీ షాకిచ్చింది. ఇదిలా వుంటే `ఆచార్య‌` టీమ్ కు తాజాగా మ‌రో షాక్ త‌గిలిన‌ట్టు తెలుస్తోంది. ఏకంగా ఓ సంస్థ వీరికి అల్టిమేట‌మ్ జారీ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌ల బిగ్ స్టార్స్ మూవీస్ థియేట‌ర్లలో విడుద‌లైన 50 రోజుల త‌రువాత గానీ ఓటీటీ ప్లాట్ ఫాం ల‌లో రిలీజ్ కావ‌డంలేదు. అంత‌కు ముందు రిలీజ్ చేయాల‌ని ఓటీటీ ప్లాట్ ఫాంస్ వొత్తిడి చేసినా ప్రొడ‌క్ష‌న్ కంప‌నీలు అందుకు అంగీక‌రించ‌డం లేదు. ముందు 50 రోజుల త‌రువాతే ఓటీటీలో రిలీజ్ అనే ఒప్పందం ప్రకార‌మే త‌మ సినిమాల‌ని ఓటీటీల‌కు అమ్మేస్తున్నాయి.

ఇక భారీ విజ‌యాలు సాధించిన చిత్రాలు కూడా తాము నిర్ణ‌యించిన స‌మ‌యంలోనే స్ట్రీమింగ్ చేయాల‌ని ఓటీటీ కంప‌నీల‌కు కండీష‌న్స్ పెడుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల విడుద‌లై పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన `ట్రిపుల్ ఆర్` ఓటీటీ రిలీజ్ క కండీష‌న్స్ పెట్టింద‌ట‌. ఎందుకంటే ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ కాబ‌ట్టి ఓటీటీ దిగ్గ‌జాలు కూడా సైలెంట్ అయ్యార‌ట‌. కానీ `భీమ్లా నాయ‌క్‌` విష‌యంలో మాత్రం అలా జ‌ర‌గ‌లేదు. చాలా త్వ‌ర‌గానే ఓటీటీ లో ఈ మూవీని రెండు ఓటీటీలు స్ట్రీమింగ్ చేశాయి.

ఇప్ప‌డు `ఆచార్య‌`కు కూడా ఈ ముప్పు వుంద‌ని తెలుస్తోంది. బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా ఫ్లాప్ కావ‌డంతో ముందు చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం కాకుండా చాలా ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామ‌ని, ఇందుకు మీరే డేట్ ని నిర్ణ‌యించండ‌ని ఆమెజాన్ ప్రైమ్ `ఆచార్య‌` టీమ్ కు ఆల్టిమేట‌మ్ జారీ చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మే 20నే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తామంటూ ఆమెజాన్ వ‌ర్గాలు డెడ్ లైన్ పెట్టార‌ట‌. దీన్ని త‌ప్ప‌ని స‌రిగా అంగీక‌రించాల్సిన ప‌రిస్థితి త‌లెత్త‌డంతో చేసేది లేక‌ `ఆచార్య‌` మేక‌ర్స్ చేతులెత్తేసిన‌ట్టుగా చెబుతున్నారు.