Begin typing your search above and press return to search.
థియేటర్ల దుంప నాశనం.. ఆగేదెలా ఈ క్రతువు?
By: Tupaki Desk | 17 Sep 2020 12:30 AM GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా థియేటర్లన్నీ మూతపడ్డాయి. మిగతా దేశాల్లో ఇప్పుడిప్పుడే థియేటర్లు రీఓపెన్ అవుతున్నా ఇండియాలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఆన్ లాక్ పక్రియ దేశ వ్యాప్తంగా మొదలైనా కేంద్రం మాత్రం థియేటర్ల విషయంలో మాత్రం పెదవి విప్పడం లేదు. ఇండస్ట్రీకి చెందిన వాళ్లు అదిగో ఇదిగో అంటున్నా థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఒక వేళ రీఓపెన్ అయినా సీటింగ్ కెపాసిటీ విషయంలో మార్పులు చేయాలి. శానిటేషన్ రూల్స్ తో సవాలక్ష తలనొప్పులు. పెట్టుబడి ఎక్కువ రాబడి తక్కువతో బొమ్మ ఆడించాల్సిన దుస్థితి.
పైపెచ్చు థియేటర్లో ఆడియన్స్ మధ్య సామాజిక దూరం తప్పని సరిగా పాటించాలి. అలా చేయాలంటే థియేటర్ ఫుల్ కాకూడదు. సగం సీట్లకు మాత్రమే టిక్కెట్స్ కట్ చేయాలి. శానిటైజేషన్ చేయాలి. థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. అలా చేయడం వల్ల భారీ చిత్రాల నిర్మాతలకు నష్టాలు తప్పవు. వీటన్నింటినీ భరిస్తూ థియేటర్స్ ఓపెన్ చేయడం అవసరమా అన్నది మేజారిటీ వర్గంలో వినిపిస్తోంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆడియన్స్ థియేటర్లకి వస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటికే ఇతర దేశాల్లో థియేటర్లు రీఓపెన్ చేశారు. హాలీవుడ్ ఫిల్మ్ `టెనెట్`, `ములన్`చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు రాకపోవడంతో భారీ ఓపెనింగ్స్ ని రాబట్టలేకపోయాయి. భారీ నష్టాలని చవిచూశాయి.
క్రిస్టోఫర్ నోలన్ `టెనెట్` కు నెలరోజుల్లో 500 మిలియన్ డాలర్లు కొల్లగొట్టే సత్తా వుంది. కానీ కరోనా వల్ల 205 మిలియన్ డాలర్లు మాత్రమే రాబట్టి వరల్డ్ ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేస్తోంది. `ములన్` పరిస్థితి కూడా ఇందుకు బిన్నంగా ఏమీ లేకపోవడంతో భారీ చిత్రాల నిర్మాతలు గుండె పట్టుకుంటున్నారు. ఈ చిత్రాల పరిస్థితే ఇలా వుంటే మన పరిస్థితి మరీ దారుణంగా వుంటుందని మన నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు. ఇదిలా వుంటే భారతీయ సినిమా ఎగ్జిబిటర్స్ ముఖ్యంగా మల్టీప్లెక్స్ అసోసియేన్ మాత్రం మల్టీప్లెక్స్ థియేటర్లని రీ ఓపెన్ చేయాల్సిందే అంటూ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. అక్టోబర్ నుంచైనా థియేటర్స్ రీఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ `టెనెట్` పరిస్థితి చూసిన వారంతా థియేటర్ కంటే ఓటీటీనే సేఫ్ అంటున్నారు. ఇప్పుడు థియేటర్లను తెరిపించినా వినోదం కోసం జనం అంత రిస్క్ చేస్తారా? అన్నది టన్ను బరువున్న ప్రశ్న.