Begin typing your search above and press return to search.
ఆశ్చర్యంః ఓటీటీ సినిమాను థియేటర్ కోసం రీమేక్ చేస్తున్నారు.. తెలుగులో కూడా..!
By: Tupaki Desk | 18 Feb 2021 2:10 PM GMTఒక సినిమా థియేటర్లో రిలీజైన తర్వాత టీవీల్లో, ఓటీటీల్లో ప్రసారం కావడం సాధారణం. కానీ.. ఓటీటీలో రిలీజైన ఒక సినిమాను బిగ్ స్క్రీన్ కోసం రీమేక్ చేయడం.. ఖచ్చితంగా అసాధారణమే! అవును.. ఓటీటీలో రిలీజైన ఓ మలయాళం సినిమాను తెలుగు, తమిళ్ లో రీమేక్ చేయబోతున్నారు! ఇప్పుడీ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల ఓటీటీలో రిలీజైన మలయాళ చిత్రం 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్'. ఈ ఏడాది ప్రారంభం నుంచి స్ట్రీమింగ్ లో ఉన్న ఈ మూవీ.. అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కేరళను దాటి, ప్రపంచానికి చేరువైందీ మూవీ.
ప్రతీ మహిళ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను కథాంశంగా ఎంచుకోవడమే మొదటి సక్సెస్ అయితే.. అందరినీ ఆకట్టుకునే రీతిలో తెరకెక్కించాడు దర్శకుడు జియో బాబీ. పెళ్లయిన తర్వాత మెట్టినింట అడుగుపెట్టే వధువు తొలినాళ్లలో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయాల్సి వస్తుందనే ఇతివృత్తంతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
దీంతో.. ఈ సినిమాను తెలుగు, తమిళ్ భాషల్లో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు కోలీవుడ్ నిర్మాత ఆర్. కన్నన్. రెండు భాషల్లోనూ ఈ సినిమాను ఒకేసారి తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి, ఈ మూవీలో ఎవరెవరు నటిస్తారు? దర్శకుడు ఎవరు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి ఒక డిజిటల్ రిలీజ్ మూవీ.. థియేటర్ కోసం రీమేక్ అవుతుండడం చాలా గొప్పవిషయమే!