Begin typing your search above and press return to search.
వెండితెర పొమ్మంటే ఓటీటీకి సై అంటున్నారు!
By: Tupaki Desk | 4 Nov 2022 9:30 AM GMTఒకప్పుడు వెండితెరపై తమ బొమ్మ చూసుకోవాలని ప్రతీ హీరో కలలు కనేవాడు. కానీ ఇప్పడు ట్రెండు మారింది.కరోనా తరువాత ప్రేక్షకుల్లో భారీ మార్పులు చోటు చేసుకొవడం అంతా ఓటీటీలకు ప్రధాన్యతన నిస్తుండటంతో ఓటీటీ ప్రభావం రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. ఇదే సమయంలో చాలా మంది హీరోలు నటించిన సినిమాలకు థియేటర్లలో ఆదరణ కరువవుతోంది. ఓపెనింగ్స్ కూడా రాక థియేటర్లు వెళ వెళ బోతుండటంతో చాలా వరకు హీరోలు కొత్త దారులు వెతుక్కుంటున్నారు.
ఓటీటీల బాట పడుతున్నారు. వెండితెరపై తమ సినిమాలకు ఆదరణ రోజు రోజుకీ కరువు అవుతున్న నేపథ్యంలో ఓటీటీ బాట ఎంచుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో అవకాశం వస్తే తాను కూడా ఓటీటీలో నటించడానికి సై అంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కొంత మంది ఓటీటీ ప్లాట్ ఫామ్ ల కోసం వెబ్ సిరీస్ లు చేస్తున్నారు.
మంచు విష్ణు నిర్మించిన `చదరంగం`తో శ్రీకాంత్ ఓటీటీ బాటపట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత చిరు పెద్ద కుమార్తె సుష్మిత నిర్మించిన `షూటౌట్ ఎట్ ఆలేర్`లోనూ నటించాడు. త్వరలో మరిన్ని వెబ్ సిరీస్ లలో నటించబోతున్నాడు. ఇక జగపతి బాబు, నవీన్ చంద్ర వంటి వారు ఆర్కా మీడియా నిర్మించిన `పరంపర`తో ఓటీటీ బాట పట్టిన విషయం తెలిసిందే. ఫస్ట్ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతోరీసెంట్ గా సిరీస్ 2ని కూడా విడుదల చేశారు.
ఇదే బాటలో నాగచైతన్య `దూత`తో డిజిటల్ వరల్డ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. `మనం` ఫేమ్ విక్రమ్ కె. కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సిరీస్ లో నిత్యామీనన్ కూడా నటిస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఇక నెట్ ఫ్లిక్స్ కోసం వెంకీ మామా, రానా కలిసి `రానా నాయుడు` పేరుతో రూపొందుతున్న వెబ్ సిరీస్ లో నటించారు. ఇటీవల విడుదలైన టీజర్ అంచనాల్ని పెంచేసింది. ఇక ప్రియమణి కూడా వెబ్ సిరీస్ లు చేస్తున్న విషయం తెలిసిందే.
వెండితెరపై నటించిన సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాల్ని అందించకపోవడంతో చాలా మంది యంగ్ హీరోలు కూడా ఓటీటీ బాట పట్టేస్తున్నారు. తాజాగా ఇదే బాటలో రాజ్ తరుణ్ ఎంట్రీ ఇస్తున్నాడు. తను నటించిన తాజా వెబ్ డ్రామా `ఆహా నా పెళ్లంట`. జీ 5 లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఈ యంగ్‌హీరో తరహాలోనే ఆది సాయికుమార్ కూడా ఓటీటీ బాట పట్టేయబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్ హీలు కూడా ఓటీటీపై ఆసక్తిని చూపిస్తుండటం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.