Begin typing your search above and press return to search.
నాని వెంటపడుతున్న ఓటీటీలు..!
By: Tupaki Desk | 18 Aug 2021 2:30 PM GMTఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ హవా మొదలయ్యాక స్టార్ హీరోల సినిమాలు కూడా డిజిటల్ విడుదలకు మొగ్గుచూపుతున్నాయి. గత రెండేళ్లుగా అనేక చిత్రాలు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. టాలీవుడ్ లో మాత్రం ఒకరిద్దరు క్రేజీ హీరోలు తప్ప పెద్దగా ఎవరూ ఓటీటీ రిలీజులకు ముందుకు రాలేదు. తెలుగులో తన సినిమాని నేరుగా డిజిటల్ వేదికలతో విడుదల చేయడానికి అనుమతించిన మొదటి క్రేజీ హీరో నేచురల్ స్టార్ నాని అని చెప్పాలి.
కరోనా ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ సమయంలో థియేటర్లు మూతబడి ఉండటంతో నాని కెరీర్ లో 25వ ప్రాజెక్ట్ గా రూపొందిన ''V'' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. ఇప్పుడు పాండమిక్ సెకండ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో "టక్ జగదీష్" చిత్రాన్ని ఓటీటీకి ఇవ్వాల్సిన వచ్చింది. ఓటీటీ డీల్ గురించి మేకర్స్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. నాని సినిమా డిజిటల్ రిలీజ్ కు రెడీ అయినట్లు తెలుస్తోంది. వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ కి పెడతారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఇప్పుడు నాని హీరోగా నటిస్తున్న మరో మూవీ కోసం ఓటీటీ సంస్థలు భారీ ఆఫర్ ఇవ్వడానికి రెడీ అయినట్లు టాక్ వినిపిస్తోంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ''శ్యామ్ సింగ రాయ్''.. నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిస్తున్న సినిమా. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లోకి దిగుతోంది.
ఈ నేపథ్యంలో 'శ్యామ్ సింగ రాయ్' సినిమా డైరెక్ట్ ఓటీటీ విడుదల కోసం అమెజాన్ ప్రైమ్ ఓటీటీ భారీ మొత్తాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చిందట. 'టక్ జగదీష్' చిత్రానికి 38 కోట్ల వరకు చెల్లించిన స్ట్రీమింగ్ దిగ్గజం.. ఇప్పుడు 'శ్యామ్ సింగ రాయ్' కు రెట్టింపు ఇవ్వడానికి కూడా రెడీ అయిందని టాక్ నడుస్తోంది. అయితే నాని మాత్రం వరుసగా తన మూడో సినిమాని డైరెక్ట్ రిలీజ్ కు అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే ఓటీటీలోనే వరుసగా సినిమాలు విడుదల చేస్తే.. నాని థియేట్రికల్ మార్కెట్ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే నాని ఈ ఫ్యాన్సీ ఆఫర్ ని తిరస్కరించారని అంటున్నారు.
'శ్యామ్ సింగ రాయ్' సినిమాను డిసెంబర్ లో థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో నాని సరసన సాయి పల్లవి - కృతి శెట్టి - మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మెలోడీ సాంగ్స్ స్పెషలిస్ట్ మిక్కీ జె.మేయర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన నాని ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది