Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్టర్ సమర్పణలో ఓటిటి ప్రాజెక్ట్..!

By:  Tupaki Desk   |   13 Jun 2021 3:30 PM GMT
స్టార్ డైరెక్టర్ సమర్పణలో ఓటిటి ప్రాజెక్ట్..!
X
సినీ ప్రేక్షకులు ఒకప్పుడు కాలక్షేపం కోసం ఉపయోగించే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఉపయోగించే వారు. కానీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాములు లేకపోతే జనాలు ఏమైపోతారో అన్నట్లుగా మారింది పరిస్థితి. రోజురోజుకి ఓటిటిల అవసరం.. ఉపయోగం అలా పెరిగిపోతుంది. మూవీ థియేటర్స్ మూతపడటం వలన ఓటిటిలే జనాలకు పెద్దదిక్కు అయిపోయాయి. గతేడాది కాలంగా థియేటర్లు మూసేయడంతో సినీ ప్రేమికులు అందరూ డిజిటల్ ప్లాట్ ఫామ్ లకు అలవాటు పడిపోయారు. ఇండస్ట్రీలో చిన్న నిర్మాతల నుంచి బడా నిర్మాతల వరకు అందరూ డిజిటల్ స్ట్రీమింగ్ ఛానల్స్ లో తమ సినిమాలు రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

నిజానికి థియేటర్లో దొరికే మజా ఓటీటీలో రాదని ఓవైపు అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అలా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నవారే తెల్లారితే అదే మాటమీద నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో సినిమా వాళ్లకు ఓటీటీ తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ఈ క్రమంలో సినిమాలలో నటించే స్టార్ హీరోలు హీరోయిన్లు.. సీనియర్ ముద్దుగుమ్మలు అందరూ కూడా ఓటీటీలో వెబ్ సిరీస్ బాటపడుతున్నారు. ఇంకా భవిష్యత్తులో ఓటిటిలకు మంచి డిమాండ్ ఉంటుందని సీన్ అర్ధం అవడంతో ఇప్పటి నుంచే యాక్టర్స్ తమ స్థానాలను కన్ఫర్మ్ చేసుకుంటున్నారు.

అందులో భాగంగానే డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కే వెబ్ సిరీస్ లలో నటించడానికి ఒకే చెబుతున్నారు. ఈ బాటలో దర్శకులు కూడా పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే చాలామంది దర్శకులు ఓటిటిలో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. కానీ పలువురు స్టార్ డైరెక్టర్స్ మాత్రం దర్శకత్వం కాకుండా స్టోరీస్ ఇస్తూ నిర్మాతలుగా మారుతున్నారు. ప్రస్తుతం అలాంటి లిస్టులో చేరబోతున్నాడు మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్. అందుకు సంబంధించి ఓటిటి యాజమాన్యం కూడా క్లారిటీ ఇవ్వడం విశేషం. ఓటిటి కోసం గీతాఆర్ట్స్ బ్యానర్ లో ఓ ప్రాజెక్ట్ కు హరీష్ శంకర్ సమర్పకుడుగా వ్యవహరించనున్నాడు. ఆ ప్రాజెక్టుకు డైరెక్టర్ దశరథ్ స్టోరీ అందిస్తుండగా.. మరో దర్శకుడు ఈ ప్రాజెక్ట్ రూపొందించనున్నట్లు తెలిపారు. ఆ విధంగా హరీష్ శంకర్ ఓటిటిలో అడుగుపెట్టబోతున్నాడు. ఇదిలా ఉండగా.. హరీష్ శంకర్ త్వరలోనే పవన్ కళ్యాణ్ తో సెకండ్ మూవీ స్టార్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సమాచారం.