Begin typing your search above and press return to search.
డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తే థియేటర్ల పరిస్థితికి రాధే సాక్ష్యం
By: Tupaki Desk | 19 May 2021 8:31 AM GMTఓటీటీ మార్కెట్ పెరిగితే రాబోయే రోజుల్లో థియేటర్లు అన్ని కూడా ఫంక్షన్ హాల్స్ గా మార్చేయాల్సిన పరిస్థితి వస్తుందంటూ కొందరు సినీ ప్రముఖులు మొదటి నుండి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు అనుకున్నట్లే ఓటీటీ తో పాటు థియేటర్లలో సినిమాను విడుదల చేస్తే ఎవరు చూడటం లేదు. ఇటీవల బాలీవుడ్ లో విడుదల అయిన రాధే సినిమా నే అందుకు ప్రధాన ప్రత్యక్ష సాక్ష్యం. సల్మాన్ ఖాన్ రాధే సినిమా ను థియేటర్లతో పాటు ఓటీటీ లో కూడా విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా థియేటర్లు చాలా చోట్ల క్లోజ్ ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రం సినిమా స్క్రీనింగ్ చేశారు.
జీ5 తో పాటు థియేటర్లోల కూడా ఒకే సారి విడుదల చేసిన ఈ సినిమాకు అక్కడ ఒక ఫలితం ఇక్కడ ఒక ఫలితం దక్కింది. విడుదల అయిన మొదటి రోజుతోనే ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లను రాధే ఓటీటీ ద్వారా దక్కించుకుంది. రాధే సినిమా థియేటర్లలో మాత్రం ఏమాత్రం ప్రభావం చూపించలేదు. పలు చోట్ల ఈ సినిమాను విడుదల చేసినా కూడా వచ్చిన వసూళ్లు మరీ దారుణంగా ఉన్నాయి. రాధే సినిమా మొదటి వీకెండ్ కు గాను కేవలం 60 వేలను మాత్రమే వసూళ్లు చేసినట్లుగా ఒక జాతీయ మీడియా సంస్థ కథనంలో పేర్కొంది.
థియేటర్లోల ఒక్క షో తో లక్షల రూపాయలు వస్తాయి. కాని వీకెండ్ లో అన్ని థియేటర్లలో కలిపి కేవలం 60 వేలు రావడం అంటే మామూలు విషయం కాదు. మరీ ఇంత దారుణమైన వసూళ్లను ఊహించలేదంటూ థియేటర్ల యాజమాన్యాలు చెబుతున్నారు. ముందు ముందు థియేటర్లతో పాటు ఓటీటీ లో కూడా సినిమాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న వారికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. ఓటీటీ లో సినిమా విడుదల అయితే థియేటర్లకు జనాలు ఎవరు రారు. కనుక థియేటర్ రిలీజ్ కు ఓటీటీ రిలీజ్ కు కనీస గడుపు ఉండాలనేది సినీ ప్రేమికుల విజ్ఞప్తి.