Begin typing your search above and press return to search.
`వకీల్ సాబ్`పై ఆ ఫేక్ కథనాలే నిజమయ్యాయి!
By: Tupaki Desk | 28 April 2021 8:30 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ కేవలం రెండు మూడు వారాల్లోనే ఓటీటీల్లో రిలీజైపోతోందని సినిమా రిలీజ్ అనంతరం వైరల్ గా ప్రచారమైంది. అయితే ఈ కథనాలు థియేటర్లలోని కలెక్షన్లను ప్రభావితం చేస్తాయని చిత్రబృందం భయపడింది.. వెంటనే ఆ వార్తా కథనాలను ఖండిస్తూ నిర్మాత ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. అంతేకాకుండా నిర్మాత దిల్ రాజు .. దర్శకుడు శ్రీరామ్ వేణు ఇవన్నీ తప్పుడు కథనాలని పేర్కొంటూ వీడియో బైట్లను విడుదల చేశారు. ఆడియెన్ వాటిని నమ్మవద్దని అభ్యర్థించారు. ఈ చిత్రంపై తప్పుడు ప్రచారం తగదని ఖండించారు.
కోట్లాది రూపాయల కలెక్షన్లను నష్టపోతామనే భయాందోళనలు నిర్మాతల్లో కనిపించాయి. అందుకే ఇలాంటి ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. ఆ ప్రచారం కూడా తప్పు కాదు. కానీ ఇప్పుడు అంతా మారింది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన మూడు వారాల్లోనే ఏప్రిల్ 30 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ దీనిని అధికారికంగా ప్రకటించింది. అలాగే నిర్మాత దిల్ రాజు కి చెందిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అధికారికంగా ట్విట్టర్ లో ఈ విషయాన్ని ప్రకటించింది.
అయితే అప్పట్లో దర్శకుడు శ్రీరామ్ వేణు .. నిర్మాత దిల్ రాజు తదితర బృందం ప్రకటించినది ఫేక్ అని ప్రూవైంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దర్శకనిర్మాతలు కావాలనే అలా ప్రకటించారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది థియేటర్లలో వకీల్ సాబ్ ని వీక్షించగా ఇతర ఆడియెన్ ఓటీటీలో వీక్షించేందుకు ఆసక్తిగా ఉన్నారు. అయితే కేవలం 21 రోజుల్లోనే ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడంపై ఇండస్ట్రీ వర్గాల్లో .. అభిమానుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
కోర్ట్ రూమ్ డ్రామా నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే ఎంటర్ టైనర్ ఇది. ఇందులో పవన్ కల్యాణ్ - శ్రుతిహాసన్ - ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. నివేద థామస్- అంజలి- అనన్య నాగళ్ల ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.