Begin typing your search above and press return to search.
డైరెక్ట్ ఓటిటి రిలీజులు ఇక తగ్గుముఖం పట్టేనా?
By: Tupaki Desk | 2 Oct 2020 2:30 AM GMTకరోనా మహమ్మారీ ప్రభావం మనిషి మైండ్ పై మామూలుగా లేదు. నగరాలు ఖాళీ చేసి వెళ్లినవాళ్లలో మెజారిటీ శాతం తిరిగి వెనక్కి రారు! అని అంచనా వేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితిలోనే ఎవరైనా ఉద్యోగాల కోసం వెనక్కి వస్తున్నారు తప్ప సిటీలకు వచ్చి ఇండ్లు కొనుక్కుని స్థిరపడాలని అనుకవడం లేదనేది ఓ సర్వే. ఆ లెక్కన చూస్తే నగరాలకు వచ్చి థియేటర్లలో సినిమాలు చూడాలని ఎవరైనా అనుకుంటారా? దానికంటే ఓటీటీలో ఇంటిల్లిపాదీ 200 టిక్కెట్టుకే చూసేయాలని అనుకోరా? ఏడాది సబ్ స్క్రిప్షన్ తో పాటు టిక్కెట్టు పెట్టి ఓటీటీలు సినిమాల్ని చూపించేయాలనుకుంటున్నాయి. దీంతో థియేటర్లకు వెళ్లేందుకు ఎవరూ ఆసక్తి చూపించే వీల్లేదని భావిస్తున్నారు.
అయితే మహమ్మారీ తగ్గుముఖం పట్టాక పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే.. చిన్న సినిమాలు ఓటీటీల్లో అంతగా క్లిక్కవ్వడం లేదు. దీంతో డైరెక్ట్ ఓటిటి రిలీజులు ఇక తగ్గుముఖం పట్టినట్లేనా? లేక చిన్న సినిమాలు.. మీడియం రేంజ్ సినిమాలు డైరెక్ట్ ఓటిటి పద్ధతినే ఫాలో అవ్వడానికి ఇష్టపడతాయా అన్నది చూడాల్సి ఉంది ఇంకా..! అయితే డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చిన్న సినిమాలకి పెద్ద వరంలా కనిపిస్తోంది. అన్ని ఖర్చులకి బ్రేకులు వేసి.. హాయిగా లాభాలకి సినిమాల్ని అమ్ముకోవచ్చు. దీని కారణంగా ఇండస్ట్రీలో కొత్త నిర్మాతలు.. టాలెంట్ పుట్టుకు వస్తారు.
అయితే చిన్న సినిమాల్ని తీసుకోవడం వల్ల ఓటిటిలకు పెద్దగా లాభం ఉండదు. మీడియం రేంజ్ సినిమాలు లేదా పెద్ద హీరోలు సినిమాలు తీసుకుంటేనే ఓటిటిలకు సబ్ స్క్రైబర్స్ పెరుగుతారు. కొన్నాళ్లు పాటు ఈ మీమాంశలో ఇండస్ట్రీ ఊగిసలాడాల్సిందే. మహమ్మారీ శాంతించే వరకూ ఏదీ ఊహించడం సరికాదు. అంతా తగ్గాక థియేటర్ల ముఖం చూసేందుకు జనం వస్తే అప్పుడు కానీ గుండెలపై చెయ్యేసుకోలేని పరిస్థితి ఉందిప్పుడు. చిన్న సినిమాలు.. క్రేజు లేని వాటిని ఓటీటీల్లో వేసేందుకు కార్పొరెట్లు ఒప్పుకోకపోతే పరిస్థితి ఏమిటన్నది కూడా మునుముందు చూడాల్సి ఉంది.