Begin typing your search above and press return to search.
ఓటీటీ రైట్స్ 125 కోట్లు.. అరవ తంబీ కళ్లలో ఆనందం
By: Tupaki Desk | 30 April 2022 5:32 AM GMTసౌత్ ఇండియన్ సినిమాలో తెలుగు మరియు తమిళ సినిమా ఇండస్ట్రీలకు సమాన ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ఇప్పుడు సమాన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి అనడం కంటే బాహుబలికి ముందు వరకు సమాన ప్రాముఖ్యత కలిగి ఉండేవి అనవచ్చు. బాహుబలి సినిమా రెండు పార్ట్ లు విడుదల తర్వాత తెలుగు సినిమా ను అందుకోవడంలో తమిళ సినిమా చాలా వెనుక పడిపోయింది.
తమిళ సినిమా లు వందల కోట్లు రాబడుతున్నాయి.. కాని తెలుగు సినిమా లు వేల కోట్ల మార్క్ ను చేరాయి. బాహుబలి 2 మరియు ఆర్ ఆర్ ఆర్ సినిమాలు సునాయాసంగా వెయ్యి కోట్లు.. అంతకు మించిన వసూళ్లను దక్కించుకుని బాలీవుడ్ సినిమాలను సైతం బీట్ చేశాయి. దాంతో తమిళ తంబీల కళ్లలో రక్తం కనిపిస్తుంది. టాలీవుడ్ ను ఎలాగైన సమం చేయాలి లేదంటే బీట్ చేయాలని బలంగా కోరుకుంటున్నారు.
ఎట్టకేలకు వారి కోరిక తీర్చే సినిమా రాబోతుందని వారు భావిస్తున్నారు. అదే మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న పొన్నియిన్ సెల్వన్. అతి పెద్ద భారీ మల్టీ స్టారర్ గా రెండు పార్ట్ లుగా విడుదల కాబోతున్న ఈ సినిమా కు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు మొదలు అయ్యాయి. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ విడుదలకు సిద్దం అయ్యింది.
ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుంది. అందుకు గాను ఏకంగా 125 కోట్ల రూపాయలను సదరు ఓటీటీ నిర్మాతకు చెల్లించేందుకు ఒప్పందం జరిగిందట. ఒక తమిల సినిమా కు ఈ స్థాయిలో బిజినెస్ జరగడం ఇదే. ఇప్పుడు ఇదే నెంబర్ తమిళ సినీ ప్రేక్షకుల కళ్లలో ఆనందం నింపుతోంది. ఇన్ని రోజులు టాలీవుడ్ ను చూసి రక్త కన్నీరు పెట్టుకున్న వారు ఇప్పుడు ఏదో అద్భుతం జరగబోతుందని అభిప్రాయంతో ఉన్నారు.
తమిళ బాహుబలి గా పొన్నియిన్ సెల్వన్ ను జాతీయ మీడియా కూడా ఫోకస్ పెడుతున్న కారణంగా కచ్చితంగా హిందీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా పై చాలా అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.
రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో దక్కించుకుంటే అప్పుడు మళ్లీ తమిళ సినిమా పరిశ్రమకు కూడా టాలీవుడ్ స్థాయిలో సమాన హోదా దక్కుతుంది అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. మరి మణిరత్నం తమిళ తంబీల కళ్లలో ఆనందం కొనసాగించేనా రెండు పార్ట్ లతో వెయ్యి కోట్ల మార్క్ ను దాటేనా అనేది చూడాలి.