Begin typing your search above and press return to search.

ఓటీటీ వ‌ర్సెస్ థియేట‌ర్ వార్ ఇక షురూ!

By:  Tupaki Desk   |   21 Sep 2021 12:30 AM GMT
ఓటీటీ వ‌ర్సెస్ థియేట‌ర్ వార్ ఇక షురూ!
X
ఏడాదిన్న‌ర‌గా ఎక్కువ‌గా సినిమాల‌న్నీ ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. క‌రోనా పాండ‌మిక్ కార‌ణంగా ఓటీటీ ఒక్క‌టే ఆప్ష‌న్ కావ‌డంతో నిర్మాత‌ల‌కు..ప్రేక్ష‌కుల‌కు అదే మాధ్య‌మం అయింది. అయితే ఇప్పుడు థియేట‌ర్లు కూడా తెరుచుకున్నాయి. జ‌నాల్లో భ‌యం కూడా త‌గ్గిందని `ల‌వ్ స్టోరీ` ఆన్ లైన్ బుకింగ్స్ చెప్ప‌క‌నే చెప్పాయి. టైమ్ లేని వారంతా ఓటీటీకి వెళ్లిపోతారు. ప్రేక్ష‌కుల మ‌ధ్య సినిమాని ఎంజాయ్ చేయాల‌నుకున్న వారంతా థియేట‌ర్ వైపు మ‌ళ్లుతారు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల న‌డుమ ఓటీటీ వ‌ర్సెస్ థియేట‌ర్ మ‌ద్య గ‌ట్టి పోరు సాగ‌నుందా? అంటే అవున‌నే అనిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఓటీటీలో రిలీజ్ అయితే అగ్ర సినిమాలు ఏవైనా ఉన్నాయంటే `నార‌ప్ప‌`..`ట‌క్ జ‌గ‌దీష్` మాత్ర‌మే. క‌రోనా కార‌ణంగానే ఈ రెండు చిత్రాలు థియేట‌ర్లోకి రాలేదు.

ఇదే స‌మ‌యంలో కొన్ని మీడియం సినిమాలు థియేట‌ర్లోనే రిలీజ్ అయ్యాయి. కానీ జ‌నం భ‌యంతో థియేట‌ర్ వైపు చూడ‌లేదు. కానా ఇప్పుడు ప‌రిస్థితులు పూర్తిగా మారాయి కాబ‌ట్టి ఓటీటీ..థియేట‌ర్ మ‌ధ్య బాక్సాఫీస్ వార్ స‌వాల్ గా మారే అవ‌కాశం క‌నిపిస్తుంది. ఓటీటీ స‌త్తా ఎంత‌? థియేట‌ర్ స‌త్తా ఎంత‌న్న‌ది అన్న‌ది నిర‌పించుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ వారంలో ఓటీటీలో రెండు సినిమాలు..థియేట‌ర్లో మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముందుగా సెప్టెంబ‌ర్ 24న నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా శేఖ‌ర్ క‌మ్ములా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `ల‌వ్ స్టోరీ` థియేట‌ర్లో రిలీజ్ అవుతుంది.

ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. బాక్సాఫీస్ వ‌ద్ద కొన్ని లెక్కల్ని స‌రిచేయాల్సిన బాధ్య‌త ల‌వ్ స్టోరీపై ఉంది. ఈ చిత్రంతో పాటు త‌నిష్ న‌టించిన `మ‌రో ప్ర‌స్థానం`.. `సిండ్రిల్లా` కూడా థియేట‌ర్లోనే రిలీజ్ అవుతున్నాయి. మ‌రోవైపు సెప్టెంబ‌ర్ 24న ఓటీటీలో ఆకాశ‌వాణి రిలీజ్ అవుతుంది. రాజ‌మౌళి శిష్యుడు గంగ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం. టాప్ రైట‌ర్ బుర్రా సాయిమాథ‌వ్ ఈ చిత్రానికి మాట‌లు అందించారు. స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌దారి. ఇలా మంచి ప్యాండిగ్ తో..టాప్ టెక్నిషియ‌న్ల‌తో తెర‌కెక్కిన సినిమా ఓటీటీ కి రావ‌డం విశేషం. అలాగే దుల్కార్ స‌ల్మాన్ న‌టించిన `ప‌రిణ‌యం` కూడా ఆహాలో రిలీజ్ అవుతుంది.

తెలుగులో మంచి ఫాలోయింగ్ న‌టుడు కావ‌డంతో అంచ‌నాలు బాగానే ఉన్నాయి. ఓటీటీ రిలీజ్ లు ఎంత క‌లెక్ట్ చేస్తాయి? థియేట‌ర్ రిలీజ్ లు ఎంత వ‌సూళ్లు చేస్తాయి? అన్న‌ది చూడాలి. ఈ వ‌సూళ్ల‌ను రక‌ర‌కాల కోణాల్లో విశ్లేషించాల్సి ఉంటుంది. థియేట‌ర్ రిలీజ్ లు మొద‌టి రోజు భారీ వ‌సూళ్లు తెచ్చిన‌ప్ప‌టికీ ఓటీటీ వ‌సూళ్ల‌తో స‌రిపోల్చి విడ‌దీస్తే ట్రేడ్ లెక్క‌ల ప్ర‌కారం అస‌లు లెక్క‌లు తేల్తాయి. త‌ద్వారా ఆడియ‌న్ మైండ్ సెంట్ కూడా ఎలా ఉంద‌న్న‌ది ఓ అంచ‌నాకి రావొచ్చు. ఓటీటీ భ‌విత్య‌వం...థియేట‌ర్ల భ‌విష్య‌త్ ని నిర్ధారించుకునే ఛాన్స్ ఉంది. కార‌ణాలు ఏవైనా ఓటీటీ..థియేట‌ర్ మ‌ద్య కొంత వారైతే త‌ప్ప‌దని తెలుస్తోంది.