Begin typing your search above and press return to search.

ఫాదర్ పోవడంతో మా ఫ్యామిలీ కష్టాల్లో పడింది

By:  Tupaki Desk   |   29 Nov 2021 8:08 AM GMT
ఫాదర్ పోవడంతో మా ఫ్యామిలీ కష్టాల్లో పడింది
X
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమన్ ఒకరు. డ్రమ్మర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టిన ఆయన, అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. తన జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది తన తండ్రి మరణమేనంటూ, ఆ విషయాలను ఆయన 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో పంచుకున్నాడు. "మా తాతయ్య ఘంటసాల బలరామయ్యగారు. మా నాన్నకి సినిమాల నిర్మాణంపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఆయనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మా ఫాదర్ సాలూరి రాజేశ్వరరావుగారింట్లోనే పెరిగారు.

వాళ్లంతా కూడా మా ఫాదర్ ని ఒక కుటుంబ సభ్యుడిలానే చూసుకునేవారు. డ్రమ్మర్ డా మా ఫాదర్ ఒక వేయి సినిమాల వరకూ పనిచేశారు. నేను పుట్టే సమయానికి చెన్నైలో టాప్ ఫైవ్ డ్రమ్మర్స్ లో మా ఫాదర్ ఒకరు. మా ఫాదర్ డ్రమ్స్ ను ఇంట్లోనే ప్రాక్టీస్ చేసేవారు. ఆయన బయటికి వెళ్లినప్పుడల్లా నేను వాటితో ఆడుతూ ఉండేవాడిని. ఫాదర్ తో ఉన్న పరిచయం కారణంగా సంగీత దర్శకులు .. డ్రమ్మర్స్ మా ఇంటికి వచ్చేవారు. సరదాగా అంతా కలిసి మా ఇంట్లోనే భోజనాలు చేసేవారు. డ్రమ్స్ వాయించే విషయంలో నన్ను ఎంకరేజ్ చేసేవారు.

మా అమ్మగారు కూడా మంచి సింగర్. అందువలన నాకు తెలియకుండానే నేను సినిమా ప్రపంచానికి బాగా దగ్గరయ్యాను. డ్రమ్స్ వాయించడం కోసం ఎప్పుడు స్కూల్ వదిలేస్తారా అనే ఎదురు చూసేవాడిని. ఆడుతూ పాడుతూ కాలం గడిచిపోతున్న సమయంలో మా ఫాదర్ పోయారు. ట్రైన్ జర్నీలో ఉండగా ఆయనకి హార్ట్ ఎటాక్ అవచ్చింది. కెరియర్ పరంగా ఆయన కుదురుకుంటూ ఉండగా .. సేవింగ్స్ స్టార్ట్ అవుతుండగా ఇలా జరిగింది. ఇక నాకు మిగిలింది మా మదర్ .. నా చెల్లి. సేవింగ్స్ ఏమీ లేవు. ఏ రోజుకు ఆ రోజుగడిచిపోతూ వచ్చిందే తప్ప సేవింగ్స్ లేవు.

మా తాతగారి వైపున ఎన్నో ఆస్తిపాస్తులు ఉండేవని మా ఫాదర్ చెబుతుండేవారు. ఖరీదైన కార్లు చాలా ఉండేవని అంటూ ఉండేవారు. అయితే అవన్నీ ఏమైపోయాయనేది మా ఫాదరూ పట్టించుకోలేదు .. ఆ తరువాత నేను కూడా దృష్టిపెట్టలేదు. ఫాదర్ చనిపోయిన తరువాత నా కళ్లకి కనించింది మా మదర్ .. సిస్టర్ .. అంతే. నేను 6వ తరగతిలోనే చదువును ఆపేయవలసి వచ్చింది. మా ఫాదర్ పోయిన తరువాత ఒక పాలసి క్రింద 60 వేల వరకూ వచ్చాయి. ఆ డబ్బుతో మా మదర్ నాకు డ్రమ్స్ కొనిచ్చింది. ఎన్ని కష్టాల్లో కొనిచ్చిందో నాకు తెలుసును గనుక, ఇక వాటిపైనే పూర్తి దృష్టిపెట్టాను" అని చెప్పుకొచ్చాడు.