Begin typing your search above and press return to search.
కరోనా సాయంలో మనస్టార్లు తప్పు చేశారా?
By: Tupaki Desk | 28 March 2020 2:30 AM GMTకరోనా వైరస్ ప్రభావంతో భాషాభేధం అన్నదే లేకుండా దేశవ్యాప్తంగా అన్ని సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. దినసరి వేతనాలపై ఆధారపడే సినీ కార్మికుల జీవితాలు అల్ల కల్లోలం అయ్యాయి. పూట గడవని పరిస్థితిలో ఎందరో ఎన్నో రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. అయితే టాలీవుడ్ పై ఆధారపడి జీవిస్తున్న 24 శాఖల కార్మికుల్లో పేదవారికి సాయం చేయడంలో మన స్టార్లు విఫలమయ్యారా? అంటే అవుననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వాస్తవానికి తమిళ స్టార్లలో పలువురు తొలిగా కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ వారిని ఆదుకునే ప్రయత్నం చేశారు. తమిళ అగ్ర నటుడు రజనీకాంత్ సినీ కార్మికుల్ని ఆదుకునే ప్రయత్నం చేశారు. దక్షిణ భారత ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌కు 50 లక్షల విరాళాన్ని అందజేశారు. అలాగే కమల్ హాసన్ తనవంతుగా ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పైగా ఆయన మద్రాసు పాత ఇంటిని కరోనా ఆస్పత్రికి కేటాయిస్తానని ప్రభుత్వానికి విన్నవించడంపై ప్రశంసలు కురిసాయి. అలాగే విలక్షణ నటుడు విజయ్ సేతుపతి పదిలక్షల విరాళాన్ని కార్మికుల కోసం ప్రకటించగా.. స్టార్ హీరోలు సూర్య- కార్తి కార్మిక ఫెడరేషన్ పది లక్షలు అందజేశారు. పలువురు కోలీవుడ్ స్టార్స్ సినీ కార్మికులను ఆదుకునేందుకు ప్రయత్నించారు.
ఇకపోతే ఈ రెండ్రోజుల్లో మన టాలీవుడ్ నుంచి స్పందన అంతే అద్భుతంగా ఉంది. అయితే మన స్టార్లంతా సినీకార్మికులకు ఎలాంటి ప్యాకేజీలు ప్రకటించిక పోయినా ఇరు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి లక్షల్లో విరాళాలు ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అందరికంటే ముందే రూ.2కోట్ల విరాళాన్ని ప్రకటించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ప్రభాస్ ఏకంగా 50లక్షల చొప్పున రెండు ప్రభుత్వాలకు ఇవ్వడమే గాక.. కేంద్ర ప్రభుత్వ నిధికి 3కోట్లు ప్రకటించాడు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి- చరణ్ - బన్ని- సాయి ధరమ్ వీళ్లంతా కలిసి బోలెడంత విరాళాన్ని ఎవరికి వారు విడివిడిగా ప్రకటించారు. చిరంజీవి కోటి విరాళం ప్రకటించగా.. రామ్ చరణ్ 70 లక్షలు.. బన్ని కోటి ప్రకటించారు. ఎన్టీఆర్ 75 లక్షలు ప్రకటించారు. అలాగే బన్ని తన కున్న కేరళ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఆ రాష్ట్ర సీఎం నిధికి విడిగా 25 లక్షలు విరాళం ప్రకటించడం ఆసక్తిని కలిగించింది. సాయి తేజ్ 10లక్షలు ప్రకటించారు.
మైత్రి మూవీ మేకర్స్ - హారిక హాసిని క్రియేషన్స్ సహా పలు బ్యానర్ల నుంచి లక్షల్లో విరాళాలు వెల్లువెత్తాయి. త్రివిక్రమ్ (20లక్షలు) - అనీల్ రావిపూడి (10లక్షలు).. కొరటాల 5లక్షలు.. వీవీ వినాయక్ 5లక్షలు ప్రకటించగా.. వీరు సహా పలువురు దర్శకులు లక్షల్లో విరాళాలు ప్రకటించారు. దిల్ రాజు 20 లక్షలు ప్రకటించగా..
ఇక కరోనా విషయంలో తొలిగా హీరో నితిన్ 20లక్షల విరాళం ప్రకటించగా.. అటుపై రాజశేఖర్ వంటి స్టార్లు తమ వంతు సాయానికి ముందుకొచ్చారు. సినీకార్మికుల్ని ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇక తారక్ సైతం సినీ ఇండస్ట్రీ కార్మికుల కోసం తాను ప్రకటించిన 75లక్షల్లో 25 లక్షల్ని కేటాయిస్తున్నానని తెలిపారు.న అయితే మన అగ్ర తారలు విరాళాలు ప్రకటించినా పలువురు సినీ కార్మికుల్ని దృష్టిలో పెట్టుకోకపోవడంపై మీడియాలో చర్చ సాగింది. పొట్ట గడవని సినీకార్మికులకు .. ఎగ్జిబిషన్ రంగంలో థియేటర్లలో పనులు చేసుకుని బతికే కార్మికులకు ఆర్థిక సాయం చేసి ఉండాల్సిందన్న విమర్శ ఎదురైంది. అయితేనేం ప్రజల కోసం ధాతృత్వాన్ని చాటుకున్నారు. అందుకు ప్రశంసించి తీరాల్సిందే.