Begin typing your search above and press return to search.
లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మన హీరోయిన్స్ పారితోషికం
By: Tupaki Desk | 15 March 2021 3:08 AM GMTటాలీవుడ్ తో పాటు అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో కూడా హీరోలదే పై చేయి అనడంలో సందేహం లేదు. కాని ఈమద్య కాలంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా వందల కోట్లు దక్కించుకుంటున్న దాఖలాలు ఉన్నాయి. బాలీవుడ్ లో ఇప్పటికే పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు వందల కోట్ల ను రాబట్టిన విషయం తెల్సిందే. సౌత్ లో కూడా లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు మంచి ఆధరణ ఉంది. స్టార్ హీరోయిన్స్ చేస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రాల బిజినెస్ భారీగా జరుగుతుంది. సౌత్ లో నయనతార, అనుష్క, సమంత, కీర్తి సురేష్ లు ఇప్పటికే లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసి సత్తా చాటారు. ప్రస్తుతం కూడా పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు రూపొందుతున్నాయి. అందులో ప్రధానంగా సమంత హీరోయిన్ గా నటిస్తున్న శాకుంతలం పై అందరి దృష్టి ఉంది.
గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న శాకుంతలం సినిమాకు గాను సమంత రూ.3 కోట్లకు పైగా పారితోషికంగా అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది. శాకుంతలం కోసం సమంత ను కేవలం అయిదు నుండి ఆరు నెలల డేట్లను మాత్రమే గుణశేఖర్ అడిగాడట. ఆరు నెలల లోపే షూటింగ్ ను ముగించబోతున్నారు. అందులో వర్కింగ్ డేస్ ఎన్నో అనే విషయం తెలియాల్సి ఉంది. లేడీ ఓరియంటెడ్ మూవీ ఇత తక్కువ సమయంలో పూర్తి చేయడం ఇంత భారీ పారితోషికం ఇవ్వడం అరుదుగా చూస్తూ ఉంటాం. సమంత స్టార్ డం నేపథ్యంలో ఈ భారీ పారితోషికంను గుణశేఖర్ ఆఫర్ చేశారని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కు పోటీ అన్నట్లుగా మన హీరోయిన్స్ కూడా ఇలా భారీ పారితోషికాలు తీసుకుంటున్నారు.
వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న నయన్ కూడా మూడు నుండి నాలుగు కోట్ల వరకు పారితోషికంగా తీసుకుంటుంది. ఇక కీర్తి సురేష్ వరుసగా మూడు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసింది. వాటికి కూడా భారీ ఎత్తున పారితోషికంను అందుకుంది. ఆమె వరుస ప్లాప్ ల కారణంగా కాస్త తగ్గింది. త్వరలో రాబోతున్న గుడ్ లక్ సఖి సినిమా సక్సెస్ అయితే మళ్లీ కీర్తి సురేష్ పారితోషికం పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇక సమంత శాకుంతలం సక్సెస్ అయితే పారితోషికంను రూ.5 కోట్లకు పెంచే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి ముద్దుగుమ్మలు మొన్నటి వరకు కోటి తీసుకోవడం చాలా గొప్ప విషయంగా భావించేవారు.. రెండు కోట్ల పారితోషికం అంటే అద్బుతం అన్నట్లుగా చర్చించుకునే వారు. కాని ఇప్పుడు నాలుగు అయిదు కోట్లను కూడా సౌత్ హీరోయిన్స్ అవలీలగా తీసేసుకుంటున్నారు. ముందు ముందు ఈ నెంబర్ ఎంతగా పెరుగుతుందో చూడాలి.