Begin typing your search above and press return to search.

మనోళ్లు పాన్ ఇండియా స్టార్స్‌.. వాళ్లు పాన్‌ మసాలా స్టార్స్

By:  Tupaki Desk   |   22 April 2022 5:37 AM GMT
మనోళ్లు పాన్ ఇండియా స్టార్స్‌.. వాళ్లు పాన్‌ మసాలా స్టార్స్
X
సోషల్‌ మీడియాలో బాలీవుడ్‌ స్టార్స్ పాన్ మసాలా యాడ్ లో నటించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆమద్య బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబచ్చన్ ఒక యాడ్‌ లో నటించేందుకు ఓకే చెప్పగా ఆయనపై సోషల్‌ మీడియాలో ట్రోల్స్ ఓ రేంజ్ లో వచ్చాయి. ఇప్పుడు అక్షయ్‌ కుమార్ ను కూడా సోషల్ మీడియా జనాలు ఓ రేంజ్ లో ఏకి పారేస్తున్నారు. దాంతో అక్షయ్ కుమార్‌ క్షమాపణలు చెప్పి మరీ సైడ్ అవుతున్నట్లుగా ప్రకటించాడు.

బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోలు అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేర్లలో అక్షయ్‌ కుమార్‌.. షారుఖ్‌ ఖాన్ మరియు అజయ్ దేవగన్ ల పేర్లు ముందు ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అలాంటి వీరు ముగ్గురు కూడా పాన్ మసాలా యాడ్‌ లో నటించడం సిగ్గు చేటు అంటూ స్వయంగా వారి యొక్క అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాని పాన్‌ మసాలా ను ప్రోత్సహించడం అనేది ఎంత వరకు కరెక్ట్‌ అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఒక వైపు సౌత్‌ స్టార్ హీరోలు అయిన ప్రభాస్‌.. అల్లు అర్జున్‌.. యశ్‌.. విజయ్.. ఎన్టీఆర్‌.. రామ్‌ చరణ్‌ ఇతర స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగి ఇండియన్ బాక్సాఫీస్ ను కొల్లగొడుతున్నారు. దేశ వ్యాప్తంగా వారికి రోజు రోజుకు ఆధరణ పెరుగుతోంది. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా వీరి యొక్క స్టామినా పెరుగుతూనే ఉంది. సౌత్‌ నుండి ముందు ముందు మరింత మంది పాన్ ఇండియా స్టార్స్ వస్తారనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

సౌత్‌ లో పాన్ ఇండియా స్టార్స్ పెరుగుతుంటే.. నార్త్‌ లో మాత్రం ఇలా పాన్ మసాలా స్టార్స్ పెరగడం దారుణం. అత్యంత దారుణమైన విషయం ఏంటీ అంటే పాన్ ఇండియా స్టార్స్ తో పోల్చితే వీరు పేరు గొప్పగా ఇన్నాళ్లు చెప్పుకుంటున్నారు. కాని వారి యొక్క పాన్ మసాలా స్టార్‌ డమ్‌ తో ఉన్న పరువు కాస్త పోగొట్టుకుంటున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

సోషల్‌ మీడియాలో వీరికి సంబంధించిన విషయాలు వైరల్‌ అవుతున్నాయి. పాన్ ఇండియా స్టార్స్ మరియు పాన్‌ మసాలా స్టార్స్ అంటూ కంపైర్ చేస్తూ పోస్ట్‌ లు పెడుతున్నారు. ఆ పోస్ట్ లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బాలీవుడ్‌ మరియు సౌత్ లో కొందరు స్టార్స్ ఇలా చేయడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌ లో ఆ ముగ్గురు స్టార్స్ ను హీరోలు అనడం కంటే పాన్ మసాలా వ్యాపారవేత్తలు అనాలంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.