Begin typing your search above and press return to search.
అమెరికాలో హాలోవీన్ వేడుకల్లో మన 'ఆర్‌ఆర్‌ఆర్'
By: Tupaki Desk | 31 Oct 2022 11:30 AM GMTఅమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాల్లో హాలోవీన్ వేడుకలను వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. వివిధ వేశాల్లో పార్టీల్లో పాల్గొనీ వేడుక జరుపుకుంటూ ఉంటారు. అమెరికాలో హాలోవీన్ వేడుకల్లో ఈసారి ఆర్ ఆర్ ఆర్ థీమ్ సందడి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్డింగ్ లో ఉన్న వ్యక్తులను లేదా టాపిక్స్ ను హాలోవీన్ వేడుకల్లో భాగస్వామ్యం చేయడం మనం చూస్తూనే ఉంటాం.
గత కొన్ని నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ ఫీవర్ కొనసాగుతోంది. భారత దేశంలోనే కాకుండా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యి ప్రపంచ వ్యాప్తంగా కూడా అల్లూరి మరియు కొమురం భీమ్ ల గురించి మాట్లాడుకునేలా చేసింది అంటూ ఈ ఫోటో ను చూస్తేనే అర్ధం అవుతోంది.
తాజాగా అమెరికాలోని మిస్సౌరీ రాష్ట్రం సెయింట్ లూయిస్ లో జరిగిన హాలోవీన్ వేడుకల్లో ఇద్దరు వ్యక్తులు ఇలా ఆర్ ఆర్ ఆర్ థీమ్ తో సందడి చేశారు. ఒకరు కొమురం భీమ్ పాత్రను పోలి ఉన్న కాస్ట్యూమ్స్ ను ధరించగా మరొకరు రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్ర వేషధారణ లో ఉన్నారు. వీరు ఆ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఇన్ని నెలలు అవుతున్నా కూడా జనాల హృదయాల్లో కొనసాగుతూనే ఉంది అంటే ఏ స్థాయి విజయాన్ని ఈ సినిమా దక్కించుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఒక్క ఆస్కార్ బ్యాలన్స్ ఉంది. అక్కడ కూడా నామినేషన్ దక్కించుకుంటే జక్కన్న కష్టంకు ప్రతిఫలం దక్కినట్లే. ప్రైవేట్ గా ఆస్కార్ నామినేషన్స్ ట్రై చేస్తున్న చిత్ర యూనిట్ సభ్యులకు ప్రతిఫలం దక్కేనా చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.