Begin typing your search above and press return to search.

అమెరికాలో మ‌నోళ్ల అరెస్ట్‌..బార్డ‌ర్‌ లో క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   14 Aug 2018 7:49 PM IST
అమెరికాలో మ‌నోళ్ల అరెస్ట్‌..బార్డ‌ర్‌ లో క‌ల‌క‌లం
X
అమెరికాలో మ‌నోళ్ల‌కు ఊహించ‌ని చేదుక‌బురు ఎదురైంది. త‌మ దేశానికి అక్రమంగా వలస వచ్చిన సుమారు 100 మందిని అమెరికా అధికారులు అరెస్టు చేశారు. బోర్డర్ ప్యాట్రోల్ - ఇమ్మిగ్రేషన్ అధికారులు వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వారిలో భారతీయులు కూడా ఉన్నారు. అయితే అరెస్టు అయిన వారిలో ఎంత మంది భారతీయులు ఉన్నారన్న అంశాన్ని ఏజెన్సీ వెల్ల‌డించ‌లేదు. గతంలో భారత్‌ లోని పంజాబ్‌ కు చెందిన సుమారు వంద మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దానికి కొన‌సాగింపుగా ప్ర‌స్తుతం ప‌రిణామం చోటుచేసుకోవ‌డం, వారి వివ‌రాలు తెలియ‌క‌పోవ‌డంతో ప‌లువురిలో ఆందోళ‌న నెల‌కొంది.

అక్రమంగా వస్తున్న ఇమ్మిగ్రెంట్లను అదుపు చేయడానికి ఈ సరిహద్దు గోడ నిర్మిస్తామని ట్రంప్ ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చారు. శరణార్థులుగా వచ్చి అమెరికాలో సెటిలైపోతున్న వారి సంఖ్యను బాగా తగ్గించాలని ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. మెక్సికోతో పాటుగా సిరియా - ఇతర తీవ్రవాద దేశాల నుండి ఎవరూ అమెరికాలోకి రాకుండా తాత్కాలికంగా నిరోధించాలని యోచిస్తున్నారు. దీంతోపాటుగా దేశంలోని వారిలో అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌ను ఏరివేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గత అయిదు రోజులుగా హూస్టన్‌లో జరిగిన గాలింపు చర్యల్లో .. ఇమ్మిగ్రేషన్ అధికారులు 45 మందిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో హోండర్స్ - ఎల్ సాల్వడార్ - మెక్సికో - గాటేమాల, అర్జెంటీనా - క్యూబా - నైజీరియా - చిలీ - టర్కీతో పాటు భారత దేశస్థులు ఉన్నారని ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు. డిపోర్ట్ అయిన తర్వాత కూడా కొందరు అక్రమంగా దేశంలోకి చొరబడ్డారని - అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు అమెరికా అధికారులు స్పష్టం చేసింది. కాగా, టెక్సాస్‌లోని ఓ చెక్ పాయింట్ వద్ద రిఫ్రిజిరేట‌ర్‌ లాకర్‌ లో సుమారు 78 మందిని అదుపు చేశారు.