Begin typing your search above and press return to search.
టాలీవుడ్ కు యుఎస్ బయ్యర్ల వార్నింగ్
By: Tupaki Desk | 23 Oct 2015 11:45 AM GMTటాలీవుడ్లో పెద్ద సినిమాలకు సంబంధించి టాక్ ముందు తెలిసేది యుఎస్ నుంచే. అక్కడే ముందు రోజు ప్రిమియర్ షోలు పడతాయి. యుఎస్ టైమింగ్ మనకంటే పది గంటలు లేటు అయినప్పటికీ.. ఒక రోజు ముందే ప్రిమియర్ షోలు వేయడం వల్ల అక్కడే ముందు బొమ్మ పడుతుంది. అక్కడి నుంచే మనకు టాక్ తెలుస్తుంది. ఐతే అక్కడి కంటే ముందు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ప్రిమియర్ షోలు వేస్తే అక్కడ చాలా డ్యామేజ్ జరిగిపోతుంది. ముందే టాక్ తెలిసిపోతే అక్కడ ప్రిమియర్ షోలు వర్కవుట్ కావు. సినిమా బాగుంటే ఓకే కానీ.. నెగెటివ్ టాక్ వస్తే మాత్రం అంతే సంగతులు. బ్రూస్ లీ సినిమా విషయంలో అదే జరిగింది.
విడుదలకు ముందు రోజు రాత్రి దేవనార్ బ్లైండ్ స్కూల్ పిల్లల కోసమని హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో రాత్రి 7.45కి బ్రూస్ లీ ప్రిమియర్ షో వేశారు. ఆ షో మధ్యలోంచే సినిమా గురించి నెగెటివ్ కామెంట్లు మొదలైపోయాయి. షో ముగిసేసరికి ట్విట్టర్ లో చాలా వరకు నెగెటివ్ కామెంట్లే కనిపించాయి. దీంతో యుఎస్ జనాలు అది చూసి అక్కడ ‘బ్రూస్ లీ’ ప్రిమియర్ షోలపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత కూడా అక్కడి కలెక్షన్లపై బాగా ప్రభావం పడింది. తొలి వారంలో అక్కడ రూ.2 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. దీంతో భారీగా పెట్టుబడి పెట్టిన బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. హైదరాబాద్ లో ముందు రోజు ప్రిమియర్ షో వేయడం వల్లే ఇంత నష్టం వచ్చిందంటూ తోటి బయ్యర్ల దగ్గర బ్రూస్ లీ బయ్యర్ ఆవేదన వ్యక్తం చేశాడట. దీంతో అక్కడి బయ్యర్లందరూ కలిసి టాలీవుడ్ నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చారట. ఇకపై ముందు రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రిమియర్ షోలు వెయ్యొద్దని అలా చేస్తే తాము సినిమాలే కొనమని తేల్చి చెప్పారట.