Begin typing your search above and press return to search.

ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ల మాయాజాలం.. అలా ఉందట

By:  Tupaki Desk   |   27 Dec 2019 9:06 AM GMT
ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ల మాయాజాలం.. అలా ఉందట
X
టాలీవుడ్ సినిమాల కు తెలుగు రాష్ట్రాలే కాకుండా చాలా మార్కెట్లు ఉన్నాయి. వాటిలో ఓవర్సీస్ మార్కెట్ ఒకటి. అయితే మిగతా ఏరియాలకు ఓవర్సీస్ మార్కెట్ భిన్నమైనది. ఇక్కడ సూపర్ హిట్ అయిన తెలుగు సినిమాలు ఓవర్సీస్ లో విజయం సాధిస్తాయని గ్యారెంటీ లేదు. ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా ఫ్లాప్స్ గా నిలుస్తూ ఉండడం తో ఓవర్సీస్ లో అన్నీ సినిమాలు నష్టాలు తీసుకొస్తున్నాయనే ప్రచారం ఊపందుకుంది. అది అందరూ నిజమనే నమ్ముతున్నారు.

ఈ ఏడాది మొత్తానికి మూడు.. జస్ట్ మూడు తెలుగు సినిమాలు మాత్రమే అమెరికా లో హిట్ అయ్యాయని.. మిగతావన్నీ ఫ్లాపులేనని ఈమధ్య కథనాలు వస్తున్నాయి. అయితే వాస్తవ పరిస్థితి వేరేగా ఉందట. ఈ ఏడాది ఎక్కువ సినిమాలు ఓవర్సీస్ లో విజయం సాధించాయట. అయితే వాటికి ఫ్లాప్ అనే ముద్ర వేశారట. ఎక్కువమంది యూఎస్ డిస్ట్రిబ్యూటర్ల కు కొమ్ము కాసే కొని వెబ్ సైట్లు ఇలాంటి ప్రచారం చేపడుతూ నిర్మాతలను మభ్య పెడుతున్నారట. నిజానికి ఇలాంటి ప్రచారం తోనే ఓవర్సీస్ రైట్స్ ధరలను ఇప్పటికే పాతాళానికి తీసుకొచ్చారట. ఇంకా వీటిని కిందకు తీసుకు పోయి.. ఫిబ్రవరి లో విడుదల కాబోయే సినిమాల రైట్స్ ను నామ మాత్రపు ధరలకే చేజిక్కించుకునేలా ఈ ఎత్తుగడ వేశారట. యూఎస్ లో డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందనే ప్రచారం తో తెలుగు నిర్మాతలను బెదరగొట్టి అక్కడ పాతుకు పోయిన డిస్ట్రిబ్యూటర్ల కు మేలు చేసేందుకు ఈ వెబ్ సైట్లు ఇలాంటి ప్రచారం చేపట్టాయట.

యూఎస్ లో సినిమాల కు ఎక్కువ గా నష్టాలు వస్తున్న మాట నిజమే కానీ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఎవ్వరూ అమాయకంగా నిర్మాతలు ఏ రేట్ చెప్తే ఆ రేట్ కు గుడ్డిగా సినిమా రైట్స్ కొనడం లేదు. సినిమా ఫ్లాప్ అయినా తాము సేఫ్ జోన్ లో ఉండే రేట్ల కు సినిమాలను కొంటున్నారట. ఈ విషయాల ను నిర్మాతలు గ్రహించి తమ సినిమాలకు వాస్తవంగా ఎంత మార్కెట్ ఉందో స్వయంగా రంగంలోకి దిగి తెలుసుకోవాలని.. కొందరు దేశముదురు డిస్ట్రిబ్యూటర్లు.. కొన్ని వెబ్ సైట్ లు చేసే అసత్య ప్రచారాన్ని నమ్మకూడదని ఓవర్సీస్ వ్యవహారాలను దగ్గరగా పరిశీలిస్తున్న వారు చెప్తున్నారు.