Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: RRR కి ఓవ‌ర్సీస్ పంచ్!

By:  Tupaki Desk   |   31 Oct 2021 10:30 AM GMT
ట్రెండీ టాక్‌: RRR కి ఓవ‌ర్సీస్ పంచ్!
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్-యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `ఆర్.ఆర్.ఆర్` పాన్ ఇండియా కేట‌గిరీలో జ‌న‌వ‌రి 7న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. `బాహ‌బలి` రికార్డులే టార్గెట్ గా `ఆర్ ఆర్ ఆర్` బాక్సాఫీస్ బ‌రిలోకి దిగుతుంది. ఈ త్ర‌యంపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలున్నాయి.` బాహుబ‌లి` రికార్డుల‌ను కొల్ల‌గొట్టేయ‌డం ఖాయ‌మంటూ ట్రేడ్ వ‌ర్గాలు సైతం అంచ‌నా వేస్తున్నాయి. జ‌క్క‌న్న ఈ సినిమా తీసిందే త‌న రికార్డుల‌ను తానే బ్రేక్ చేసుకోవ‌డం కోసం అన్న టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

మ‌రి అది సాధ్య‌మ‌వుతుందా.. లేదా? అన్న‌ది ప‌క్క‌న‌బెడితే..తెలుగు సినిమాకు అమెరికా మార్కెట్ చాలా కీల‌డం. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కీల‌క‌మైన ఏరియాలతో ఓవ‌ర్సీస్ పోటా పోటీగా నిలుస్తోంది. `ఆర్ ఆర్ ఆర్` యూఎస్ఏ హ‌క్కులు 40 కోట్ల‌కు అమ్మ‌డు పోయాయి. స‌రిగ‌మ సినిమాస్.. రాప్తార్ క్రియేష‌న్స్ సంయుక్తంగా అమెరికాలో రిలీజ్ చేస్తున్నాయి. అయితే ఈసారి టిక్కెట్ ధ‌ర‌ల విష‌యంలో కొత్త ట్రెండ్ లో వెళ్తున్నారు. ప్రీమియ‌ర్ స‌హా అన్ని షోల‌కు ఒకే ధ‌ర‌ను నిర్ధారించారు. `బాహుబ‌లి -`2 రెగ్యుల‌ర్ షోల‌కంటే కూడా త‌క్కువ ధ‌ర ఉండేలా నిర్ణ‌యించారు.

ఇది అక్క‌డి ప్రేక్ష‌కుల‌కు గుడ్ న్యూస్ అయినా ఆ త‌గ్గింపు వ‌ల్ల రికార్డ్ బ్రేకింగ్ క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని తెలుస్తోంది. యూఎస్ ఏలో `ఆర్ ఆర్ ఆర్ ` టిక్కెట్ ధ‌ర‌లు ప‌రిశీలిస్తే ఇలా ఉన్నాయి. పెద్ద‌ల‌కు 23 డాల‌ర్లు..పిల్ల‌ల‌కు 18 డాల‌ర్లు.. xd..rpx..plf స్క్రీన్ వంటి పెద్ద ఫార్మెట్ లో మాత్రం పెద్ద‌ల‌కు 27 డాల‌ర్లు...పిల్ల‌ల‌కు 20 డాల‌ర్లు టిక్కెట్ ధ‌ర‌లుగా కేటాయించారు. ఐమాక్స్.. డీబాక్స్.. డాల్బీ సినిమాస్ లో పెద్ద‌ల‌కు 30 డాల‌ర్లు.. పిల్ల‌ల‌కు 23 డాల‌ర్లుగా నిర్ణ‌యించారు.

హిందీ..త‌మిళం..క‌న్న‌డం..మ‌ల‌యాళం భాష‌ల్లో పెద్ద‌ల‌కు 16 డాల‌ర్లు.. పిల్ల‌ల‌కు 12 డాల‌ర్ల ధ‌రిని కేటాయించారు. అమెరికాలో 40 కోట్ల‌కు అమ్మ‌డుపోయింది కాబ‌ట్టి `ఆర్ ఆర్ ఆర్` బ్రేక్ ఈవెన్ కి 11 మిలియ‌న్ డార్లు చేయాలి. `బాహుబ‌లి -2` మాత్రమే అక్క‌డ 11 మిలియ‌న్ కంటే ఎక్కువ డాల‌ర్లు తెచ్చింది. మ‌రి ఈనేప‌థ్యంలో `ఆర్ ఆర్ ఆర్` బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాలు సాధిస్తుందో చూడాలి.