Begin typing your search above and press return to search.

శింబు తోడు జీవితాంతం కావాలనిపిస్తుంది

By:  Tupaki Desk   |   27 Feb 2019 10:44 AM GMT
శింబు తోడు జీవితాంతం కావాలనిపిస్తుంది
X
తమిళ న్యూస్ బిగ్ బాస్ న్యూస్ ఫాలో అయిన వారికి తప్ప తెలుగు ఆడియన్స్ లో ఎక్కువ మందికి ఓవియా పేరు తెలియదు. బిగ్ బాస్ కు ముందు అడపాదడపా సినిమాలలో నటించినా రాని క్రేజ్ ఆమెకు బిగ్ బాస్ తో వచ్చేసింది. బిగ్ బాస్ జరిగే సమయంలో తమిళనాడులో ఆమె పేరు చెప్తే పూనకాలు వచ్చేంత ఫాలోయింగ్ ఓవియా ఆర్మీ పేరుతో ఏర్పడింది. దీంతో ఓవియా తాజా తమిళ చిత్రం '90 ఎం ఎల్' పై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ట్రైలర్లో బోల్డన్ని బోల్డ్ సీన్లతో ఏకంగా ఓవియా తన ఆర్మీకే షాక్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓవియా తమిళ హీరో శింబుతో ఎఫైర్ నడుపుతోందని కోలీవుడ్లో వార్తలు వచ్చాయి. ఓవియా.. శింబులు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని.. అందుకే ఓవియా సినిమాకు శింబు సంగీతం అందించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈమధ్య ఓవియాను ఇదే విషయంపై ప్రశ్నిస్తే శింబు తనకు మంచి స్నేహితుడని చెప్పింది. "ప్రేమ ఎక్కడైనా పుట్టొచ్చు. ఎప్పుడైనా పుట్టొచ్చు. కానీ శింబు నాకు మంచి స్నేహితుడు. " అని సగం సగం చెప్పింది. 'ఎప్పుడైనా పుట్టొచ్చు' అంటే..త్వరలో పుట్టే అవశాన్ని తీసిపారేయలేం.. అలా అని పుట్టకపోనూవచ్చు అనే కదా?

ఓవియా తనకు ఏవైనా సలహాలు కావాలంటే శింబును అడుగుతుందట. శింబు తనను ఎప్పుడూ ప్రోత్సహిస్తారని.. జీవితాంతం ఆయన తోడు కావాలనిపిస్తుందని చెప్పింది. 'ఓన్లీ ఫ్రెండ్ అంటుంది.. కానీ జీవితాంతం ఆయన తోడుగా కావాలనిపిస్తుంది'.. ఎన్నప్పా.. ఓవియా లాజిక్ రొంబ కన్ఫ్యూషనా ఇరుక్క..!