Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ లోకి మళ్లీ రాలేను!!

By:  Tupaki Desk   |   18 Aug 2017 11:49 AM GMT
బిగ్ బాస్ లోకి మళ్లీ రాలేను!!
X
తమిళ బిగ్ బాస్ షోని ఏ క్షణాన మొదలు పెట్టారో గాని రేటింగ్ కోసం షో నిర్వాహకులు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. షో మొదట్లోనే ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. కానీ ఆ తరువాత వచ్చిన కాంట్రవర్సీలే షోకి కాస్త బూస్ట్ ని ఇచ్చాయి. ఇక నటి ఓవియా కూడా బిగ్ బాస్ షోకి కాస్త ప్రాణం పోసింది. కొన్ని రోజుల వరకూ బాగానే ఉన్నా. ఆ నటికి ఏమైందో ఏమో గాని షోలో ఉండలేనని చెప్పి పెద్ద కాంట్రవర్సీ చేసి వెళ్ళిపోయింది. ఆమె ఆత్మహత్య కు ప్రయత్నించిన సంగతి కూడా తెలిసిందే.

అయితే ఆమె వెళ్ళిపోయిన తర్వాత షో నిర్వాహకులకు దిమ్మ తిరిగినట్లయ్యింది. ఓవియా కోసమే చాలామంది బిగ్ బాస్ ను చూసేవారు కానీ ఆమె సడన్ గా వెళ్లిపోవడంతో రేటింగ్ కూడా మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. షో కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నా ఏ మాత్రం లాభం లేకపోయింది. అయితే షో నిర్వాహకులు వెంటనే ఓవియా ను మళ్లీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా షోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుండగా.. ఓవియా ఇప్పుడు షాక్ ఇచ్చింది. తాను తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టలేనని తేల్చి చెప్పేసింది. అలాగే అభిమానులు కూడా తనను క్షమించాలని ఓ వీడియా ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

తాను వెళ్లిపోవడానికి కారణం అప్పటి పరిస్థితులకు అలవాటు పడలేకపోయానని చెబుతూ.. తాను వెళ్లిపోవడానికి కారణం ఆ షోలో ఉన్న పార్టిసిపెంట్స్ కాదని చెప్పింది. ఒకవేళ ఏమైనా తప్పు జరిగి ఉంటే క్షమించాలని కోరుతూ.. నా కోసం ఇతర పార్టిసిపెంట్స్ పై విమర్శలు చేసేవారు నా ఫ్యాన్స్ కాదని తెగేసి చెప్పేసింది. ఇక ప్రతి మనిషీ కొన్ని సమయాల్లో తప్పు చేయడం సహజమని చెబుతూ.. అలాంటి కొన్ని పరిణామాలే నా లైఫ్ లో చోటు చేసుకున్నాయని అందరికి ఓ మెస్సేజ్ ఇచ్చింది ఓవియా. ఫైనల్ గా మరొకసారి బిగ్ బాస్ హౌస్ లోకి మళ్లీ అడుగుపెట్టానని తెలియజేసింది.