Begin typing your search above and press return to search.
అవును.. కాజల్ ఇంప్రెస్ అయ్యింది
By: Tupaki Desk | 13 July 2017 5:30 AM GMTటాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. ఈ భామ ఎంజాయ్ చేస్తున్న టాప్ హీరోయిన్ స్టేటస్ కు బీటలు పడ్డాయని గతేడాది వరకూ అంతా అనుకున్నారు. వరుసగా అన్ని సినిమాలు పల్టీ కొట్టేయడం కూడా ఈ మాటలకు బలాన్ని ఇచ్చింది. అయితే.. పక్కా లోకల్ అంటూ జనతా గ్యారేజ్ ఐటెంతో తన క్రేజ్ ఎలాంటిదో చూపించిన కాజల్.. ఆ వెంటనే మెగాస్టార్ తో కలిసి ఖైదీ నంబర్ 150 అంటూ ఇండస్ట్రీ హిట్ సాధించి ఫామ్ లోకి వచ్చేసింది.
ఇప్పుడు కాజల్ కొత్త అవతారంలో కనిపించనుందట. తన కెరీర్ లోనే మొదటిసారిగా లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించేందుకు సిద్ధమవుతోంది. సీనియర్ తమిళ దర్శకుడు పి వాసు ఈ విషయాన్ని కన్ఫాం చేశారు. ఇప్పటికే కాజల్ తో పలు మార్లు చర్చలు కూడా జరిపారట. 'స్టోరీ లైన్ చెప్పినపుడు కాజల్ చాలా ఇంప్రెస్ అయింది. ఈ పాత్రలో నటించే విషయంలో ఆమె చాలాసార్లు ఆలోచించింది. యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించాల్సి ఉండడమే ఇందుకు కారణం. చాలా కాలంగా యాక్షన్ మూవీలో నటించాలని చూస్తున్న ఆమెకు.. నేను తీయనున్న థ్రిల్లర్ అందుకు కూడా స్కోప్ ఇవ్వనుంది' అని చెప్పాడు పి వాసు.
'ప్రస్తుతం నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను. తిరిగి ఇండియాకు రాగానే డేట్స్.. షెడ్యూల్స్ పై ప్లానింగ్ చేయాల్సి ఉంది. జూలై నెలాఖరు నాటికి అన్నీ పూర్తయిపోతాయి. ప్రస్తుతం కాజల్ ఈ ప్రాజెక్టుపై ఇంట్రెస్టింగ్ గానే ఉంది' అని చెప్పిన దర్శకుడు పి వాసు.. ఈ చిత్రాన్ని తమిళ్.. తెలుగు భాషల్లో రూపొందించనున్నట్లు తెలిపాడు.