Begin typing your search above and press return to search.
స్టోరీలు చెబుతున్న మహారధి డైరెక్టర్
By: Tupaki Desk | 28 Nov 2016 3:49 AM GMTసౌత్ లో బోలెడన్ని 'చంద్రముఖి' రేంజ్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడు పి.వాసు. కొన్నేళ్ల నుంచి ఈయన ఏ మాత్రం ఫామ్ లో లేడు. సౌత్ లో దాదాపు అన్ని భాషల్లో ప్రయత్నాలు జరిగాయ్ కానీ.. ఎక్కడా లక్కు మాత్రం చిక్కలేదు. ఇప్పుడీ దర్శకుడు బాలయ్యతో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తూ.. కథలు వినిపించేస్తున్నాడు.
రీసెంట్ గా కన్నడ మూవీ శివలింగ తో సక్సెస్ సాధించిన పి వాసు.. ఆ మూవీ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కు బాలయ్య అటెండ్ అయ్యేలా చేశాడు. ఆ తర్వాత శివ లింగ రీమేక్ లో బాలయ్యను నటించమని కోరడం.. బాలయ్య వద్దనడం జరిగిపోయాయి. తాజాగా మరో కథ వినిపించినా సరే నచ్చలేదనేశారట బాలయ్య. 101వ సినిమా విషయంలో కూడా బాలకృష్ణ చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే.. తనకు 2007లో మహారధి లాంటి ఆల్ టైం డిజాస్టర్ ను ఇచ్చిన పి వాసుతో పని చేసేందుకు సిద్ధపడడం లేదని తెలుస్తోంది.
మహారధి ఒక్కటే కాదు.. నాగార్జున-మంచు విష్ణులతో తీసిన కృష్ణార్జున.. రజినీకాంత్-జగపతిబాబులతో కథానాయకుడు.. వెంకటేష్ తో తీసిన నాగవల్లి.. ఇలా బోలెడన్ని అరివీర భయంకరమైన ఫ్లాప్స్ తర్వాత శివలింగ సక్సెస్ వచ్చినా.. బాలయ్య మాత్రం పి.వాసును నమ్మే పరిస్థితిలో లేరట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/