Begin typing your search above and press return to search.

చందమామతో మరో చంద్రముఖి

By:  Tupaki Desk   |   12 July 2017 4:36 AM GMT
చందమామతో మరో చంద్రముఖి
X
కోలీవుడ్ దర్శకుడు పి. వాసుతో సినిమా చేసేందుకు ఎలాంటి నటీనటులైనా ఉత్సాహం చూపిస్తుంటారు. కమర్షియల్ మూవీస్ నుంచి కాన్సెప్ట్ బేస్డ్ థీమ్స్ వరకు ఎలాంటి సినిమా అయినా పక్కా కమర్షియల్ హంగులతో తెరకెక్కించడంలో ఈయన మహా ఘటికుడు. చంద్రముఖిలో లీడ్ రోల్ జ్యోతికదే అయినా.. ఆ మూవీలో రజినీకాంత్ ను హీరోగా చేసి.. ఈయన తెరకెక్కించిన తీరు మహాద్భుతం అని చెప్పాలి.

ఇప్పుడు దర్శకుడు పి వాసు.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే కాజల్ కు సంక్షిప్తంగా కథ వివరించడం కూడా జరిగిందట. అయితే.. స్టోరీ తెగ నచ్చేసినా మూవీలో చేసేందుకు అంగీకరించడానికి కొంత సమయం కావాలని కోరిందట చందమామ. ఇందుకు కారణం.. ఇది పూర్తి స్థాయిలో ఫిమేల్ సెంట్రిక్ మూవీ కావడమే అంటున్నారు. తన అందంతో థియేటర్లకు ఆడియన్స్ ను రప్పించడం కాజల్ కు కొత్తేమీ కాదు కానీ.. సినిమా బాధ్యతను పూర్తిగా తనపైనే వేసుకుని మోయడం అనే పాయింట్ మాత్రం ఈమెకు పక్కాగా కొత్తే.

అందుకే ఈ థ్రిల్లర్ లో నటించేందుకు కాజల్ తటపటాయిస్తోందని తెలుస్తోంది. ఒకవేళ లీడ్ రోల్ లో నటించేందుకు కాజల్ అంగీకరిస్తే మాత్రం.. ఈ చిత్రానికి చందమామ ఫిమేల్ సెంట్రిక్ మూవీ చేయడం అనే పాయింటే ప్రధాన ఆకర్షణ అయిపోతుంది. ప్రస్తుతం ఇదే విషయంపై తెగ తర్జన భర్జన పడిపోతోందట కాజల్.