Begin typing your search above and press return to search.

ఇది నమ్మొచ్చా తలైవా?

By:  Tupaki Desk   |   10 March 2018 1:08 PM GMT
ఇది నమ్మొచ్చా తలైవా?
X
సూపర్ స్టార్ రజనికాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి చర్చ ఈనాటిది కాదు. జయలలిత ప్రభ వెలిగిపోతున్న సమయంలోనే తలైవాను రాజకీయాల్లోకి రమ్మని అబిమానులు మొదలుకొని వివిధ వర్గాల నుంచి ఒత్తిడి ఉంటూనే వచ్చింది. కాని రజని తిరస్కరిస్తునే వచ్చాడు. కాని ఇప్పుడు మాత్రం ఉన్నట్టుండి ఎలా ప్రకటించాడు ఎవరు ప్రభావితం చేసారు అనే అనుమానాలు అయితే చాలా వచ్చాయి. దీనికి కోలీవుడ్ మీడియా కొత్త నిర్వచనం ఇస్తోంది. రజనిని తీవ్రంగా ప్రభావితం చేసింది కాలా - కబాలి దర్శకుడు రంజిత్ పానట. అదేంటి మహామహులు చెబితేనే వినని రజని కేవలం తనతో రెండు సినిమాలు చేసిన రంజిత్ మాట ఎలా వింటాడు అనే డౌట్ రావొచ్చు. రంజిత్ విపరీతమైన అభ్యుదయ భావాలు కలిగిన వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన యువకుడు. తన ఎదుగుదలలో ఎన్నో అవమానాలు ఎదుర్కున్న రంజిత్ అవే భావాలు తన సినిమల్లో కూడా చూపిస్తూ ఉంటాడు.

ఇవన్ని రజనితో రంజిత్ రోజు చర్చించేవాడట. వ్యవస్థ ఇలాగే ఉంటే లాభం లేదని స్వార్థం లేని మీలాంటి వారు రాజకీయల్లోకి వచ్చే సమయం ఆసన్నమయ్యిందని రోజు మోటివేట్ చేసేవాడట. వాటి వల్ల ప్రభావితం చెందారని విశ్లేషణ బయటికి తెచ్చారు. కాని రాజకీయ పరిశీలకులు మాత్రం దీన్ని కొట్టి పారేస్తున్నారు. జయ బ్రతికి ఉన్న సమయంలో తాను కాకుండా సినిమా వాళ్ళు ఎవరు రాజకీయాల్లోకి రాకుండా శాసించారని, తనను చిన్న మాట అన్నా ఎంతటి నరకం చూపిస్తుందో కమల్ హాసన్, విజయ్ లాంటి వాళ్ళకు బాగా అనుభవమే అని గుర్తు చేస్తున్నారు. అందుకే క్లీన్ గా ఉన్న తన ఇమేజ్ ని చెడగొట్టుకోవడం ఇష్టం లేని రజని జయ ఉన్నన్నాళ్ళు రాజకీయ ప్రవేశం గురించి ఆలోచించలేదట. ఒకవేళ చేస్తే జయ తీసుకునే ప్రతీకార చర్యలకు తనకు జాతీయ స్థాయిలో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నందున సైలెంట్ ఉండి ఆమె వెళ్ళిపోగానే టైం చూసుకుని ఎంటర్ అయ్యాడు అంటున్నారు.

ఏది ఎలా ఉన్నా రజనికాంత్ వచ్చిన టైం ఏమో కాని సినిమా వాళ్ళ నుంచే విపరీతమైన పోటీ వస్తోంది. ఒక పక్క కమల్ హాసన్, మరో పక్క టి. రాజేందర్ పక్కలో బల్లెం లాగా తయారు కాగా విజయ్ కాంత్ సహాయంతో పరిశ్రమలోని వ్యతిరేక వర్గం మొత్తం వేరే పార్టీ వైపు మళ్లేలా పావులు కదుపుతోందట. మొత్తానికి తమిళ రాజకీయాలు ఎన్నడు లేనంత ఆసక్తిని రేపుతూ సరికొత్త పరిణామాలకు దారి తీస్తున్నాయి.