Begin typing your search above and press return to search.

వారి ఆవేదనను అర్థం చేసుకోవాలి : కాలా డైరెక్టర్‌

By:  Tupaki Desk   |   17 April 2019 7:56 AM GMT
వారి ఆవేదనను అర్థం చేసుకోవాలి : కాలా డైరెక్టర్‌
X
సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేదింపులు ఇప్పటివి కాదు. ఎప్పటి నుండో మహిళలు లైంగిక వేదింపులకు గురి అవుతున్నారు. ఆ విషయాన్ని ఎవరు కాదనలేరు. ఎంతో మంది హీరోయిన్స్‌ ఇంకా ఇతరులు లైంగిక వేదింపులకు గురి కాబడ్డారు. అయితే మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత కొందరు తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి చెప్పేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో వారిపై కక్ష సాదింపు చర్యలు - వారిపై విమర్శలు చేయడం జరుగుతుంది. వైరముత్తు పై లైంగిక వేదింపుల ఆరోపణలు చేసినందుకు గాను నిర్మాత రాజన్‌ మాట్లాడుతూ చిన్మయి పైకి 50 మంది ఆడవారిని పంపి ఆమెకు గుణపాఠం చెప్తానంటూ 'పారా' ఆడియో విడుదల కార్యక్రమంలో వ్యాఖ్యలు చేయడం జరిగింది.

రాజన్‌ ఆ వ్యాఖ్యలు చేసిన 'పారా' ఆడియో విడుదల కార్యక్రమంలోనే సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ తో రెండు సినిమాలు చేసిన పా రంజిత్‌ మీటూకు మద్దతుగా మాట్లాడాడు. రాజన్‌ వ్యాఖ్యలను అదే వేదికపై ఖండించాడు. శ్రీరెడ్డి వంటి వారు చేస్తున్న ఆరోపణలను మనం ఒకసారి ఆలోచించాలి, వారు చేస్తున్న ఆరోపణలపై లోతుగా ఇన్వెస్టిగేషన్‌ జరగాలంటూ స్టేజ్‌ పై ఉన్న నిర్మాత రాజన్‌ కు షాక్‌ ఇచ్చాడు. ఒకే వేదికపై మీటూ గురించి రెండు భిన్న వాదనలు వ్యక్తం అవ్వడం చర్చనీయాంశం అవుతోంది.

ఇంతకు పా రంజిత్‌ ఏమన్నాడంటే.. మహిళలపై అలాంటి కామెంట్స్‌ చేయడం భావ్యం కాదు, ఎప్పటి నుండో వారు ఇండస్ట్రీలో వేదింపులకు గురి అవుతున్నారు. ఆ విషయాన్ని అందరు అంగీకరించారు. ఎవరైనా మహిళ లైంగిక వేదింపుల గురించి మాట్లాడిన సమయంలో మనం అంతా కూడా ఆ విషయమై ఇన్వెస్టిగేషన్‌ చేయాల్సిన అవసరం ఉంది. ఆమె చెప్పిన విషయంలో నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. లైంగిక వేదింపుల కంప్లైంట్‌ నమోదు చేసిన వారిని వేదించడం మానుకోవాలి. వారిని ఇబ్బంది పెడితే మరెవ్వరు కూడా తమకు జరిగిన అన్యాయంను చెపేందుకు ముందుకు రారు.