Begin typing your search above and press return to search.

పిచ్చిగా ప్రేమించే ఎమోష‌న‌ల్ పాగల్ క‌థ ఇది!-విశ్వ‌క్

By:  Tupaki Desk   |   28 March 2021 1:30 PM GMT
పిచ్చిగా ప్రేమించే ఎమోష‌న‌ల్ పాగల్ క‌థ ఇది!-విశ్వ‌క్
X
త‌న‌దైన ఎన‌ర్జిటిక్ పెర్ఫామెన్సెస్ తో మెప్పిస్తున్న హైద‌రాబాదీ హీరో విశ్వ‌క్ సేన్. ఫ‌ల‌క్ నుమా దాస్ .. హిట్ చిత్రాల‌తో తెలుగు ఆడియెన్ ముందుకు వ‌చ్చాడు. తొలి సినిమాతోనే న‌టుడిగా ప్ర‌శంస‌లు అందుకుని మ‌లి సినిమాతో ఆశించిన‌ హిట్టు కొట్టాడు. ప్ర‌స్తుతం పాగ‌ల్ అనే చిత్రంతో ఆడియెన్ ముందుకు వ‌స్తున్నాడు.

పాగ‌ల్ పిచ్చిగా ప్రేమించే ఓ యువ‌కుడి క‌థ‌. ప్రేమ‌లో ప‌డ్డాక పిచ్చెక్కిపోయే యువ‌కుడిగా క‌నిపిస్తాను. అందుకే పాగ‌ల్ అని టైటిల్ పెట్టామ‌ని విశ్వ‌క్ తెలిపారు. దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. మార్చి 29 పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టాలెంటెడ్ యంగ్ హీరో విశ్వక్‌ సేన్ చాలా విష‌యాలు వెల్లడించారు.

ముఖ్యంగా ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ని కేవ‌లం థియేట‌ర్స్ లోనే ప్లే చేస్తామ‌ని.. నిర్మాత‌ దిల్‌రాజు ఈ విష‌యంలో చాలా హ్యాపీ అని తెలిపారు. ఇంత‌కు ముందు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ కేవ‌లం థియేట‌ర్స్‌లోనే ప్లే అయ్యేది. ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్‌మీడియా- స్మార్ట్ ‌ఫోన్ ‌ల‌లోనే ఎక్కువ ప్లే అవుతుంది. అలా వ‌ద్ద‌నుకునే మా టీమ్ అంతా ఈ కొత్త నిర్ణ‌యం తీసుకున్నాం...అని తెలిపారు.

రేప‌టితో పాగ‌ల్ సినిమా షూటింగ్ పూర్త‌వుతుంది. ఏప్రిల్ ఫ‌స్ట్ నుండి ఈ సినిమాకి సంబందించి నాన్‌స్టాప్ అప్ డేట్స్ ఉంటాయన్నారు. మ‌రో 15రోజుల్లో పాగ‌ల్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో పాగ‌ల్ ర‌థ‌యాత్ర చేయ‌బోతున్నాం. వీలైన‌న్ని ఎక్కువ జిల్లాల్లో ప‌ర్యటించ‌నున్నామ‌న్నారు. టీజ‌ర్ కి స్పంద‌న బావుంది. ఎంట‌ర్ టైన్ మెంట్ స‌హా ఎమోష‌న్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని తెలిపారు. పుట్టినరోజున కూడా షూటింగ్ చేస్తున్నాన‌ని విశ్వ‌క్ తెలిపారు.

అలాగే త‌దుప‌రి చిత్రం `ప్రాజెక్ట్ గామీ` షూటింగ్ పూర్త‌య్యింది. క్లాసిక్ అడ్వెంచ‌ర్ డ్రామా అది. డిఫ‌రెంట్ లొకేష‌న్స్‌లో షూటింగ్ చేశాం. ఆ సినిమాలో సీజీ వ‌ర్క్ ఎక్కువ ఉంది. నిర్మాణానంత‌ర ప‌నుల‌కు మ‌‌రో ఆరు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. అలాగే పివిపి బ్యాన‌ర్ ‌లో ఒక సినిమా చేస్తున్నా..అది ఏప్రిల్ 3నుండి షూటింగ్ మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత బీవిఎస్ఎన్ ప్ర‌సాద్‌గారితో ఒక సినిమా ఉంది. ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి... అంటూ చ‌క‌చ‌కా వివ‌రాలు తెలిపారు.