Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: ప్రేమ - పరువు - ప్రతిష్ట - గౌరవం లాంటి అంశాల సంకలనం 'పావ కధైగల్'
By: Tupaki Desk | 3 Dec 2020 12:18 PM GMTప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ నెట్ ఫ్లిక్స్ మొట్ట మొదటి తమిళ ఆంథాలజీ సిరీస్ ''పావ కధైగల్'' ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. నలుగురు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ - వెట్రి మారన్ - సుధా కొంగర - విఘ్నేశ్ శివన్ కలిసి నాలుగు కథల ఈ ఆంథాలజీ సిరీస్ ను క్రియేట్ చేశారు. డిసెంబర్ 18న 'పావ కధైగల్' విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవలే టీజర్ ని రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ ని నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసింది.
మానవ సంబంధాలపై ప్రేమ - పరువు - ప్రతిష్ట - గౌరవం లాంటి అంశాలు ఎలాంటి ప్రభావం చూపాయనే విషయాన్ని నాలుగు అందమైన కథల సంకలనంలో ఆవిష్కరించారు. సంక్లిష్టమైన సంబంధాలను భావోద్వేగంతో కూడిన కథాంశాలతో రూపొందించినట్లు తెలుస్తోంది. మొదటి కథ తండ్రి నిర్ణయాన్ని కాదని వేరే కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుని గర్భవతి అయిన కూతురికి మధ్య చోటు చేసుకుంది. ఇందులో తండ్రి పాత్రను ప్రకాష్ రాజ్ పోషించగా, కుమార్తెగా సాయి పల్లవి కనిపించింది.
రెండవ కథలో దర్శకుడు గౌతమ్ మీనన్ ఆస్ట్రోనాట్ కావాలని కలలు కనే అమ్మాయికి తండ్రిగా కనిపిస్తున్నాడు. గౌతమ్ భార్య పాత్రలో కనిపించిన సిమ్రాన్.. పరువు కోసం కఠిన నిర్ణయం తీసుకునే మహిళగా కనిపించింది. మూడవ కథ భారతదేశంలో చాలా కుటుంబాలలో ఆమోదయోగ్యం కాని లెస్బియన్ లవ్ స్టొరీ. ఇందులో అంజలి - కల్కి కొచ్లిన్ ప్రేమికులుగా కనిపిస్తున్నారు. నాల్గవ స్టోరీ ముస్లిం యువకుడు - హిందూ అమ్మాయి మధ్య ప్రేమ గురించి వివరిస్తోంది. మొత్తం మీద 'పావ కధైగల్' లో భారతీయ సమాజంలో ఉన్న సమస్యలను ధైర్యంగా ప్రస్తావించినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.
ఇందులో జయరాం - భవానీ శ్రీ - కాళిదాసు - పదమ్ కుమార్ - శాంతను భాగ్యరాజ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్‌ఎస్‌విపి మూవీస్ మరియు ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై 'పావ కధైగల్' సిరీస్ నిర్మించబడింది. ఈ ఆంథాలజీ డిసెంబరు 18న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.