Begin typing your search above and press return to search.
క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ కొట్టేసిన ‘పడేసావే’
By: Tupaki Desk | 16 Feb 2016 1:30 PM GMTతక్కువ బడ్జెట్టు సినిమాలను కూడా ప్రమోట్ చేయడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. ఆయన క్యాంపు నుంచే వస్తున్న మరో సినిమా ‘పడేసావే’. అన్నపూర్ణ స్టూడియోస్ తో చాలా కాలంగా అసోసియేట్ అయివున్న చునియా అనే లేడీ డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తానే స్వయంగా అయాన్ క్రియేషన్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. అందుకు అక్కినేని నాగార్జున కూడా తన వంతు సహాయం అందించారు. ఈ సినిమా ప్రమోషన్ కి నాగార్జున ఆశీస్సులు వున్నాయి. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కార్తీక్ రాజు - సామ్ - నిత్యశెట్టి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్ సంగీతం అందించగా... అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాశారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై యూత్ లో మంచి క్రేజ్ వుంది.
ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది. సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ప్రదానం చేశారు. దాంతో చిత్రంలో ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగులకు గానీ... ఒల్గారిటీకి గానీ తావులేదని తెలిసిపోయింది. క్లీన్ యు సర్టిఫికెట్ రావడంతో చిత్ర దర్శకురాలు చునియా ఆనందం వ్యక్తం చేసింది. అన్ని వర్గాల వారూ తమ సినిమాని చూసే విధంగా వుందని సెన్సార్ చెప్పడం పట్ల ఆమె ఉబ్బి తబ్బిబ్బవుతోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఓ ఫజిలా తెరకెక్కించిన ఈమె... సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్ గా వుంది. ఇందులో నటించిన ఇద్దరు హీరోయిన్లు కొత్తవారే. సామ్ ను అయితే ఓ కేఫ్ లో చూసి... హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకుందట. కాశ్మీర్ నుంచి వచ్చి హైదరాబాద్ నగరంలోని ఓ కాఫీ కేఫ్ లో పనిచేస్తున్న సామ్ కు... నటనలో శిక్షణ ఇచ్చి మరీ ఆమెకు అవకాశం ఇచ్చిందట చునియా. ఈ సినిమా చాలా ఫ్రెష్ గా వుంటుందని చెబుతోంది ఆమె. చూడాలి మరి ‘పడేసావే’ మూవీ ఏమాత్రం యూత్ మనసును దోచుకుంటుందో.