Begin typing your search above and press return to search.

విభిన్న నేపథ్యాల్లో ప్రేమకథలు!

By:  Tupaki Desk   |   15 Dec 2018 6:08 AM GMT
విభిన్న నేపథ్యాల్లో ప్రేమకథలు!
X
ఇప్పుడు సినీ ప్రియులందరి దృష్టి డిసెంబర్ 21 మీదే ఉంది. మూడు విభిన్నమైన సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద పోటీ పడుతుండడమే అందుకు కారణం. సహజంగా ఇలా మూడు నాలుగు సినిమాలు పోటీ పడే సమయంలో ఒక సినిమాకు క్రేజ్ ఎక్కువగా మరో సినిమాకు క్రేజ్ తక్కువగా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అన్నీ క్రేజీ సినిమాలు కావడం విశేషం.

'పడి పడి లేచే మనసు'.. 'అంతరిక్షం'.. 'కేజీఎఫ్' లు మూడు డిఫరెంట్ జానర్లో తెరకెక్కిన సినిమాలే. 'పడి పడి లేచే మనసు' ఒక టచింగ్ లవ్ స్టొరీ అనే విషయం ఇప్పటికే ప్రోమోస్ ద్వారా దర్శకుడు హను రాఘవపూడి చెప్పేశాడు. శర్వానంద్ - సాయి పల్లవిల కెమిస్ట్రీ ఇప్పటికే ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. ఇక 'అంతరిక్షం'.. 'కేజీఎఫ్' సినిమాల్లో ఒకటి స్పేస్ థ్రిల్లర్ కాగా మరొకటి 'ఛత్రపతి' టోన్ లో సాగే ఓవర్ ది టాప్ హీరోయిజం ఉండే మాస్ యాక్షన్ ఫిలిం. ఈ రెండు సినిమాల్లో కూడా లవ్ స్టొరీస్ కీలకపాత్ర పోషిస్తాయట.

'అంతరిక్షం' లో తన లవ్ స్టొరీ కారణంగానే వరుణ్ తేజ్ తన గోల్ ను పక్కనబెట్టేస్తాడట. ఇక 'కేజీఎఫ్' లో యష్ పాత్ర అంత క్రూరంగా మారడానికి హీరోయిన్ తో లవ్ స్టొరీ నే కారణమనే టాక్ వినిపిస్తోంది. అందుకే కదా 'ఎంతవారలైనా కాంత దాసులే' అన్నది. కోల్ కతా అయినా.. కోలార్ గోల్డ్ మైన్స్ అయినా.. ఆఖరుకు అంతరిక్షం అయినా హీరోలు .. హీరోయిన్ల చుట్టూ తిరగాల్సిందే!