Begin typing your search above and press return to search.

పడి పడి లేచే మనసు ప్రీ రిలీజ్ బిజినెస్

By:  Tupaki Desk   |   19 Dec 2018 6:09 AM GMT
పడి పడి లేచే మనసు ప్రీ రిలీజ్ బిజినెస్
X
హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ - సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా 'పడి పడి లేచే మనసు'. డిసెంబర్ 21 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో అంచనాలు పెంచిన ఈ సినిమాకు థియేట్రికల్ రైట్స్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. శర్వానంద్ కెరీర్లోనే ఈ సినిమాకు హయ్యెస్ట్ బిజినెస్ జరిగింది.

నైజామ్.. సీడెడ్ ఏరియాలకు నాన్ రిటర్నబుల్ అడ్వాన్సుల కింద అమ్మడం జరిగింది. ఎక్స్ పెన్సెస్ కలుపుకుని వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ఫిగర్ రూ. 22.80 కోట్లు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 23 కోట్ల షేర్ రాబట్టాలి. శర్వానంద్ లాస్ట్ ఫిలిం 'మహానుభావుడు' ఫుల్ రన్ కలెక్షన్స్ రూ. 23 కోట్లు. ఇప్పుడు మళ్ళీ 'మహానుభావుడు' కలెక్షన్స్ ఫిగర్ దాటితేనే ఈ సినిమా హిట్ కింద లెక్క.

'పడి పడి లేచే మనసు' వరల్డ్ వైడ్ ప్రీరిలీజ్ బిజినెస్ ఇలా ఉంది.

నైజామ్: 6.30 cr

సీడెడ్: 3 cr

ఏపీ: 9 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా: 1 cr

ఓవర్సీస్: 3.50 cr

వరల్డ్ వైడ్ టోటల్: రూ. 22.80 కోట్లు.