Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: అరకిలోమీటర్ దూరంలో లవ్వు
By: Tupaki Desk | 10 Oct 2018 4:35 AM GMTశర్వానంద్- సాయి పల్లవి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో? `అందాల రాక్షసి` లాంటి విభిన్న ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించిన హను రాఘవపూడి శర్వా- సాయిపల్లవి జంటతో మరో లవ్ స్టోరి తీస్తున్నాడు అనగానే ఒకటే ఉత్కంఠ. ఆ ఉత్కంఠకు తగ్గట్టే ఇదిగో తొలి టీజర్ యూట్యూబ్ లోకి దూసుకొచ్చింది. లవ్ అంటే ఏంటి? దాని ప్రభావం యువతరంపై ఎలా ఉంటుంది? అన్నది అత్యంత ప్రభావవంతంగా క్యాచీగా చూపించాడు ఈ టీజర్ లో. హృదయం స్పందించడానికి ఎంత సమయం కావాలి? కొన్ని సెకన్లు చాలదూ? అన్నట్టే ఉందీ లవ్వు వ్యవహారం.
అల్లంత దూరాన కూచుని ఎటో చూస్తాడు. ఆ చూపు తననే అని ఆ పిల్ల గ్రహించేస్తుంది. ఏంటి వెంటపడుతున్నావ్.. లవ్వా? అంటూ నిలదీసేస్తుంది. కాఫీ షాప్ - కాలేజ్ - బస్ జర్నీ - బోటు షికార్.. అన్నిచోట్లా అతడి వాలకం చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది అని అర్థం చేసేసుకుంది ఆ డాక్టరమ్మ. మొత్తానికి డాక్టర్ కే లైనేసే పోరడిగా శర్వా నటన పీక్స్ లో ఉంది. సింపుల్ ఎక్స్ ప్రెషన్స్ తో రియాలిటీకి - నేచురాలిటీకి దగ్గరగా అద్భుతంగా కుదిరిన టీజర్ ఇది. ఓయ్ లేవయ్యా లే.. ఫాలో చేస్తున్నావా? లే..! అని బెదిరిస్తోంది రౌడీ డాక్టరమ్మ. అరే మీకు తెలిసిపోయిందా..? అయినా ఇలా దగ్గరకొచ్చి మాట్లాడడం బాలేదండీ.. ఏదో నా పాటికి నేను అరకిలోమీటర్ దూరం నుంచి ప్రేమిస్తూ బతికేస్తుంటే!! అంటూ మాటలతోనే మాయ చేసేశారు శర్వా- సాయి పల్లవి జోడీ.
ప్రేమలోని మ్యాజిక్ చూడండి! అంటూ ఊరించినందుకు గమ్మత్తైన లవ్ మ్యాజిక్ ని చూపించడంలో హను & టీమ్ సక్సెసయ్యారు. తొలి చూపు బావుంది.. ప్రేమకహానీ ఆహా అనిపించింది. ఈ ప్రేమలో మెలోడ్రామా.. కీలక మలుపు ఎలివేట్ చేస్తూ పూర్తి ట్రైలర్ ని వదులుతారేమో! ఎస్.ఎల్.వి.సి సినిమాస్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. చిత్రీకరణ వేగంగా పూర్తవుతోంది. డిసెంబర్ 21 రిలీజ్ ముహూర్తం పెట్టేశారు కాబట్టి ఇక ప్రమోషనల్ స్పీడ్ పెరుగుతుందనే భావించాలి.