Begin typing your search above and press return to search.
మెలోడీ తో మనసు పడి పడి లేచేలా ఉంది!!
By: Tupaki Desk | 12 Nov 2018 1:14 PM GMTహను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ - సాయిపల్లవి జంటగా నటిస్తున్నచిత్రం 'పడిపడి లేచే మనసు'. ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ చిత్రం నుండి టైటిల్ సాంగ్ ను హను రాఘవపుడి అండ్ టీమ్ రిలీజ్ చేశారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.
ఈ పాటకు సాహిత్యం అందించింది కృష్ణకాంత్. పాడిన వారు అర్మాన్ మాలిక్.. సింధూరి విశాల్. "పదపద పదమని పెదవులిలా పరిగెడితే పరిపరి పరివిధముల మది వలదని వారిస్తే.. పెరుగుతోందే మదికాయాసం.. పెదవడుగుతోందే చెలి సావాసం పాపం బాధ చూసినట్టు పెదవులొక్కటవ్వగా ప్రాణం పోయినట్టు పోయివస్తే.. పడి పడి లేచే మనసు'. ఏం రొమాంటిక్ లిరిక్స్ అండీ బాబు. పెదవులు పరిగెట్టడం.. మదికి ఆయాసం లాంటి పద ప్రయోగాలు సూపర్. ఇక సింపుల్ పదాలతో కృష్ణకాంత్ మాయ చెయ్యగా.. దానికి ఓ సోల్ ఫుల్ మెలోడీ ట్యూన్ ను విశాల్ అందించగా అర్మాన్ మాలిక్.. సింధూరి తమ గానం తో మరో లెవల్ కు తీసుకెళ్ళారు.
పాట ఇలా ఉంటే.. స్పితి వ్యాలీ బ్యూటిఫుల్ లొకేషన్స్ లో శర్వా.. సాయి పల్లవి జోడీ ప్రేమడిగ్రీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ లో 100 మార్కులు సాధించిన ఫస్ట్ బెంచీ స్టూడెంట్స్ లా రెచ్చిపోయారు. మెలోడీస్ ఇష్టపడే వారికి మొదటి సారి వినగానే నచ్చేస్తుంది. ఇక నాకుముక్కనాకుముక్క బ్యాచ్ కి ఎక్కాలంటే ఓ అరడజను సార్లు వినాల్సి వస్తుంది. ఓవరాల్ గా పడిపడి లేచే మనసు టైటిల్ సాంగ్ చార్ట్ బస్టర్ మెటీరియలే. ఇక మీరు ఒకసారి ఈ పాట మాయలో పడి పడి లేచేందుకు సిద్ధమే కదా?