Begin typing your search above and press return to search.
బిగ్ రిలీజెస్ హాట్ డిబేట్
By: Tupaki Desk | 18 Dec 2018 4:34 AM GMT2018కి టాటా చెప్పి, 2019కి వెల్‌కం చెప్పే టైమ్ వచ్చింది. ఈ ఏడాదిలో చివరిగా వస్తున్న సినిమాల రిపోర్ట్ ఏంటి? మరో 3రోజుల్లో రెండు క్రేజీ టాలీవుడ్ సినిమాలు రిలీజవుతున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన అంతరిక్షం, వెర్సటైల్ స్టార్ శర్వానంద్ నటించిన పడి పడి లేచే మనసు.. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకి ఎలాంటి టాక్ వినిపిస్తోంది? అంటే సెన్సార్ బృందం నుంచి వచ్చిన టాక్, అలానే ఫిలింనగర్ జనాల్లో ముచ్చట్లను బట్టి .. ఆ రెండు సినిమాల సంగతి ఇలా ఉంది.
వరుణ్ తేజ్ - సంకల్ప్ రెడ్డి- రాజీవ్ రెడ్డి చేస్తున్న ప్రయోగం తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని మిగులుస్తుంది. ఇది పక్కాగా యూనివర్శల్ కాన్సెప్టుతో రూపొందిన సినిమా. స్పేస్, స్పేస్ సెంటర్ నేపథ్యం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇక స్పేస్ లో వరుణ్ తేజ్ ప్రయోగాలు, రోప్ లతో వేలాడే సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా సంకల్ప్ తెరకెక్కించారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే సెన్సార్ టాక్ .. ప్రకారం.. అంతరిక్షం క్లాస్సీ సినిమా.. పూర్తి ప్రయోగాత్మకంగా ఉంటుంది.. స్కైలో అద్భుత అనుభూతిని కలిగించే చిత్రమిది.. అని తెలిసింది.
`పడి పడి లేచే మనసు` చిత్రంలో శర్వా- సాయి పల్లవి రొమాంటిక్ లవ్ స్టోరి ఫెంటాస్టిక్ గా కుదిరింది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ స్లోగా ఉంటుంది.. కొన్ని స్లోఫేస్ సీన్స్ ఉన్నా.. సినిమా ఓవరాల్ గా హత్తుకుంటుంది.. అలాగే హనుకి ఈ సినిమా పెద్ద రిలీఫ్ నివ్వబోతోందిట. అంతరిక్షం రన్ టైమ్ ఇప్పటికే లాక్ అయ్యింది. 2.20 గంటలు (140 నిమిషాల) పాటు ఈ సినిమా రన్ అవుతుంది. ఇంచుమించు అంతే రన్ టైమ్ తో `పడి పడి లేచే మనసు` రక్తి కట్టించబోతోందిట. వరుణ్, శర్వా సినిమాలు రెండూ పెద్ద విజయాలు సాధించాలని పరిశ్రమ వర్గాలు కోరుకుంటున్నాయి. నిన్నటి సాయంత్రం శర్వా ఈవెంట్ లో బన్ని సైతం ఈ రెండు సినిమాల విజయాన్ని ఆకాంక్షించారు. ఇక వీటితో పాటే రిలీజవుతున్న మరో సినిమా కె.జి.ఎఫ్ పూర్తి యాక్షన్ సినిమా. టాలీవుడ్‌లో సరైన ప్రచారం లేక జనాల్లో పెద్దంతగా టాక్ వినిపించడం లేదు.